A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
15 నుంచి హోదా ఉద్యమం తీవ్రం
Share |
June 25 2018, 12:27 am

ఈ నెల పదిహేను నుంచి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని ప్రత్యేక హోదా సాదన సమితి నిర్ణయించింది. చలసాని శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.జూన్‌ 15 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రత్యేక సదస్సులు నిర్వహింంచాలని తలపెట్టారు.ఉపాధ్యాయులతోపాటు విద్యార్థినీ విద్యార్థులను చైతన్యవంతులను చేసి హోదా పోరులో భాగస్వాములను చేస్తారు.
యూనివర్సిటీల్లో బహిరంగ సభలు. విద్యాసంస్థలన్నింటితో నెలకోసారి భారీ ర్యాలీలు.
జాతీయ రహదారులపై రాస్తారోకో.24 గంటలపాటు జాతీయ రహదారుల దిగ్బంధనం.
రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి, 10 లక్షల కరపత్రాల ద్వారా కేంద్రం చేస్తున్న మోసాన్ని ఇంటింటికీ తీసుకెళ్లి ప్రచారం చేస్తారు.అలాగే వివిధ చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తారు.

tags : ap, special status, movement

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info