A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. రమేష్ కు చంద్రబాబు ఎంత అండ!
Share |
June 25 2018, 12:30 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతులు బాగానే చెబుతారు. కాని తన సొంత మనుషులమీద ఆరోపణలు వస్తే మాత్రం ఏమీ తెలియనట్లు ఉంటారు. రాజ్యసభ సబ్యుడు సి.ఎమ్.రమేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన మరో టిడిపి నేత వరదరాజులు రెడ్డిని చంద్రబాబు మందలించారని సమాచారం. తప్పుడు పత్రాలు పెట్టి 500 కోట్ల రూపాయల రుణం పొందారన్న ఆరోపణలు చేస్తే దానిపై విచారణ చేయించకపోగా, ఆ విషయం చెప్పిన వరదరాజులు రెడ్డిని ముఖ్యమంత్రి మందలించడం విశేషం.సి.ఎమ్.రమేష్ కు, వరదరజాలురెడ్డి మద్య వివాదాన్ని మంత్రి సోమిరెడ్డి వివరించగా, చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. కలిసి పనిచేసుకోకుండా కలహాలేమిటంటూ నేతలపై మండిపడిపడ్డారట. అలాగే, ఇటీవల సీఎం రమేశ్‌పై వరదరాజులు రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. పార్టీలో సీనియర్‌ నేత గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమని వరదరాజులు రెడ్డిని ముఖ్యమంత్రి ప్రశ్నించారని కదనం.

tags : tdp, cm ramesh, babu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info