A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కేసుల్ని మేనేజ్ చేసుకుంటారు..
Share |
October 18 2018, 7:58 am

ఎన్నో కేసులలో తనకు ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ అన్నారు. జగన్ పై కేసుల ఉన్నాయని, అవి స్పీడుగా జరగడం లేదని,చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని, కేవలం జగన్ పై కక్షతోనే అన్యాయపు రాతలు రాయిస్తున్నారని పోసాని అన్నారు. జగన్ ను ఏదో విదంగా మళ్లీ జైలులో పెట్టిస్తే తాను అదికారంలో ఉండవచ్చని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఎలా మేనేజ్ చేసుకున్నాడని ఆయన అన్నారు. కెసిఆర్ కాళ్లు పట్టుకుని మేనేజ్ చేసుకున్నారని ఆయన అన్నారు. పదిహేను కేసులలో స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని, ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.జగన్ కు, చంద్రబాబుకు ఇద్దరికి నార్కో అనాలిసిస్ పరీక్ష పెడితే చంద్రబాబు విషయాలన్ని బయటపడతాయని పోసాని అన్నారు. జగన్ పై ద్వేషంతో రాజకీయంగా నాశనం చేయాలని చంద్రబాబు ఆలోచన అని అన్నారు. తను, తన కొడుకు, మనుమడు మాత్రమే పాలన చేయాలన్నది ఆయన దురుద్దేశమిన పోసాని అన్నారు.ఇప్పుడు ఉన్న నేతలలో జగన్ సరైన వ్యక్తి అని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు నీతులు చెబుతున్నారని పోసాని మండిపడ్డారు. చంద్రబాబుకు కారెక్టర్ ఉందో లేదో కమ్మవారు తెలుసుకోవాలని పోసాని అన్నారు.ప్రజలు ముఖ్యంగా కమ్మవాళ్లు ఉన్నవాళ్లలో ఎవరు బెటరో ఆలోచించుకోవాలని పోసాని అన్నారు.

tags : chandrababu, case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info