A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టిఆర్ .ను బాబు దూషించారు- పోసాని
Share |
October 18 2018, 8:56 am

గతంలో ఎన్.టి.రామారావుకు విలువలు లేవని గతంలో చంద్రబాబు అన్నారని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ చెప్పారు. దానికి సంబందించి పేపర్ క్లిప్పింగ్ లను ఆయన ప్రదర్శించారు. ఒక వైపు ఎన్.టి.ఆర్.ను దూషించి, ఆతర్వాత ఆయన గొప్పవాడని, భారతరత్న ఇవ్వాలని అడిగారని అన్నారు. ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తమ తండ్రి ఎన్.టి.ఆర్.కు విలువలు ఉన్నాయని చెప్పాలని, అలాకాకుంటే ఎన్.టి.ఆర్ కు విలువలు లేనట్లే అవుతుందని ఆయన అన్నారు.తాను మాత్రం ఎన్.టి.ఆర్.విలువలు ఉన్న వ్యక్తి అని నమ్ముతున్నామని అన్నారు.కమ్మ వాళ్లు కూడా దీనిపై స్పందించాలని, ఎన్.టి.ఆర్.విగ్రహానికి పాలభిషేకం చేయాలని అన్నారు. గతంలో వాజ్ పేయితో కలిసి పోటీచేసి ఆ తర్వాత ఆయనను నిందించారని, బిజెపిని దూషించి ,ముస్లింలకు అన్యాయం చేశానని అన్నారని అన్నారు. అలాగే మోడీ తో ఉండి,ఇప్పుడు ఆయనను దూషిస్తున్నారని ఆయన అన్నారు

tags : posani, ntr,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info