A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై జగన్ ,పవన్ ల ఎఫెక్ట్
Share |
March 23 2019, 10:20 am

ఎపి ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైన విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ , జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ల పర్యటన ప్రభావం బాగానే పడుతున్నట్లుగా ఉంది.ఈ ఇద్దరు యువనేతల పర్యటనలలో యువత అదికంగా కనిపిస్తుండడం చంద్రబాబుకు ఆందోళన కలిగించి ఉండాలి. అందుకే నాలుగేళ్లుగా అమలు చేయని నిరుద్యోగ భృతి అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చినట్లు కనబడుతోంది. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర విజయవంతంగా జరగడమే కాకుండా, పదిహేను సీట్లకు సదిహేను టిడిపికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లాలో సైతం పెద్ద ఎత్తున జనం తరలిస్తుండడం టిడిపికి రుచించని విషయమే. ప్రతి చోట కూడా యువత అత్యధికంగా ఉంటున్నారు. మండుటెండలో ఆయనతో పాటు నడవడమే కాకుండా, సభ జరుగుతున్నంత సేపు ఎవరూ కదలడం లేదు. యువత పెద్ద ఎత్తున పాల్గొని జగన్ అడిగే ప్రశ్నలకు స్పందిస్తున్నారు . అలాగే పవన్ కళ్యాణ్ సభలలో కూడా యువతే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇదంతా ప్రబుత్వంపై ఉన్న వ్యతిరేకతే అన్న సంగతి నలభై ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడుకు తెలుసు. అందుకే ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆయన మంత్రివర్గంలో నిరుద్యోగ భృతి పై తీర్మానం చేశారు.దానిని వ్యూహాత్మకంగా మంత్రి లోకేష్ తో ప్రకటించారు.అయితే ఈ పదకం అమలులో పలు తిరకాసులు కూడా ఉన్నాయి.నాలుగేళ్లుగా దీనిని అమలు చేయకపోవడం వల్ల ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు 98 వేల చొప్పున బకాయి పడ్డారని జగన్ తన ప్రసంగాలలో ప్రస్తావిస్తుంటారు. గత బడ్జెట్ లోకూడా నిరుద్యోగ భృతి కి బడ్జెట్ కేటాయించినా, అమలు చేయలేదు. కాకపోతే తెలుగుదేశం మీడియా మాత్రం అదిగో నిరుద్యోగ భృతి, ఇదిగో నిరుద్యోగ భృతి అమటూ మబ్య పెట్టే ప్రచారం చేసింది.టిడిపి ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగ భృతిని వెయ్యి నుంచి రెండువేల రూపాయలు ఇస్తామని చెప్పారు.అలాగే యువతకు రుణాలు ఇస్తామని, అది చేస్తామని, ఇది చేస్తామని కూడా చెప్పారు.వాటన్నిటిని ఎప్పుడో గాలికి వదలివేశారు. ఇప్పుడు జనంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడం, నిరుద్యోగం తాండవిస్తుండడం తదితర కారణాలతో దానిని కొంతైనా తగ్గించే ఉద్దేశంతో బృతిని ప్రకటించారు.ఎన్నికల ప్రణాళికలో రెండువేల వరకు ఇస్తామని చెప్పినా, ఆ ఊసు ఎత్తడం లేదు. అలాగే మానిపెస్టోలో ఎలాంటి కండిషన్ లేకుండా ఉద్యోగం లేకపోతే బృతి అన్నట్లు గా వాగ్దానం చేశారు. ఇప్పుడు పలు కండిషన్ లు పెడుతున్నారు.పేదలై ఉండాలని, డిగ్రీ పూర్తి చేసి ఉండాలని ఇలా పలు షరతులు పెడుతున్నారు. నిజానికి చిత్తశుద్ది కలిగిన రాజకీయ పార్టీ అయితే ఎన్నికల ప్రణాళికలోనే ఇలాంటి షరతులు పెట్టి ఉండాల్సింది. అలా చేయలేదంటే ప్రజలను ముఖ్యంగా యువతను మోసం చేసే ఉద్దేశమే అన్నది అర్దం అవుతుంది. మరో పది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.ఇంకా నిరుద్యోగుల గుర్తింపు జరగవలసి ఉంది. అది ఎంతవరకు సజావుగా సాగుతుందన్నది చెప్పలేం. పది లక్షల మందివరకు ఇవ్వచ్చని ప్రభుత్వ అంచనా అట. అయితే ప్రతి ఇంటికి జాబు ఇస్తామని, లేకుంటే బృతి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎగవేసే ఆలోచన చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.అయితే కొందరి అనుమానం ఏమిటంటే ఎన్నికలు సమీపించే ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పందారం చేసుకోవడానికి ఈ నిధులను వాడుకోవచ్చని, వారినే నిరుద్యోగులుగా చూపి తన ఎన్నికల ప్రయోజనానికి వాడుకోవచ్చని కొందరు అంటున్నారు.ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గబ్బు పట్టిన చంద్రబాబు ప్రభుత్వం అచ్చంగా టిడిపి కార్యకర్తల నిరుద్యోగ భృతిగా మార్చితే మరింత వ్యతిరేకతనుఎదుర్కోవలసి ఉంటుంది.అదికారంలోకి వచ్చినవెంటనే ఈ స్కీమును అమలు చేసి ఉంటే మంచి పేరు వచ్చేది. కాని అలా చేయకపోవడం తో ఇదేదో గోల్ మాల్ చేయడానికే సందేహం సహజంగా వస్తుంది.అయితే ఇక్కడ ఒక విషయం అంగీకరించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకాని, ఆయన కుమారుడు,మంత్రి అయిన లోకేష్ కాని, ఎపికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని, లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని,మరిన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రచారం చేస్తుంటారు. అవన్ని అబద్దాలేనని ఈ నిరుద్యోగ భృతిద్వారా వారే అంగీకరించారన్న అబిప్రాయం కలుగుతుంది. ఏది ఏమైనా ఈ స్కీమును ఓట్ల కొనుగోలు స్కీముగా కాకుండా, తెలుగుదేశం కార్యకర్తల నిది గా మార్చకుండా,నిజమైన నిరుద్యోగులకు అందిస్తే మంచిది.

tags : ap, jagan, pawan, effect

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info