A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
షబ్బీర్ అలీ పెద్ద డైలాగే చెప్పారు
Share |
May 24 2019, 4:22 am

కాంగ్రెస్ నేతలు పెద్ద డైలాగులే చెబుతున్నారు. తెలంగాణ శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, ఆక్రమాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు జైలుకు వెళ్ల డం ఖాయమని అన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు.ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రం లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించుకున్నాడని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తానే నడుపుతున్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు.

tags : shabbir ali, kcr,jail

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info