A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారు
Share |
June 25 2018, 12:30 am

మైనార్టీలను వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని రాజంపేట ఎమ్.పి మిధున్ రెడ్డి అన్నారు.పీలేరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని ఆయన అన్నారు.వైఎస్ ఆర్ ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబునాయుడు అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేశారని ద్వజమెత్తారు. మైనార్టీలను వైఎస్సార్‌సీపీ దూరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, అందుకే వైఎస్‌ జగన్‌, బీజేపీతో కలిసాడని అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ బీజేపీతో కలవదని ఆయన స్పష్టం చేశారు.

tags : midhunreddy, babu, conspiracy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info