A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్థూలంగా ఇదీ చంద్రబాబు నాలుగేళ్ల పాలన
Share |
March 23 2019, 10:22 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా సంకల్పం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. విపక్షాలు మాత్రం ఇది మహా మోసం అని అంటున్నాయి. చంద్రబాబు నాయుడు దేశంలోనే ఎక్కడా లేనంత అబివృద్ది జరిగిందని, వృద్ది రేటు అదిరిందిని, 2029 నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రం కాబోతోందని అంటున్నారు. అలా జరిగితే సంతోషించవలసిందే. కాని అలా జరగలేదని ఆయనే చేస్తున్న ప్రసంగాలు చెబుతున్నాయి.విభజన వల్ల కష్టాలలో ఉన్నాం. ఎంతో ఆర్దిక ఇబ్బందిలో ఉన్నాం..ఎపికి కేంద్రం సహకరించడం లేదు..లేకుంటే ఇంకా చేసేవాడిని..ఇలా వైరుద్యభరిత ప్రకటనలు చేయడం ఆయన సొంతం.చంద్రబాబు పాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.నాలుగేళ్లపాటు బిజెపితో కలిసి పాలన చేసి,ఇప్పుడు విడిపోయి వారు మోసం చేశారని చంద్రబాబు అంటుంటే , చంద్రబాబుది అరాచక, అవినీతి పాలన అని బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాని, ఇతర నేతలు కాని అంటున్నారు. మరో వైపు మూడున్నర ఏల్లు మిత్రుడిగా కొనసాగిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును నమ్మి మోసపోయానని చెబుతున్నారు. మొత్తం మీద ఈ నాలుగేళ్ల పాటు ఈ ముగ్గురు ఒకరిని ఒకరు మోసం చేసుకున్నారా?లేక ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేశారు.విపక్ష నేతగా జగన్ ఎప్పటికప్పుడు ఎపి ప్రభుత్వం అవినీతి పై ,అద్వాన్నపాలనపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు.కాని అప్పట్లో బిజెపి, జనసేనలు పెద్దగా మాట్లాడలేదు. అలాగే చంద్రబాబు కూడా కేంద్రాన్ని ఎన్నడూ తప్పు పట్టలేదు. పైగా తాను కేంద్రం నుంచి తీసుకు వచ్చినన్ని నధులు ఎవరు సాదించారని మీడియా సమావేశం పెట్టి మరి సవాల్ చేశారు.మోడీ,బాబు జోడి అంటూ వెంకయ్య నాయుడు వంటి అగ్రనేతలు ప్రశంసలు కురపించేవారు. ఇప్పుడేమో మోడీ మోసం చేశాడని చంద్రబాబు, చంద్రబాబు నయవంచకుడని బిజెపి నేతలు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు.ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది. వీరు ముగ్గురు ఎవరి డ్రామా వారు ఆడుతున్నట్లు కనిపించడం లేదు.నాలుగేళ్లలో ఒక్కసారి కూడా బిజెపి అదినాయకత్వంలో ఉన్నవారికి చంద్రబాబు అవినీతి కనిపంచలేదు. అప్పట్లో కేంద్రం ప్రభుత్వం నిద్రపోతోందా?అమిత్ షా ,మోడీలు చూస్తూ కళ్లు మూసుకున్నారా? అలాగే చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత కేంద్రం ఏమీ ఇవ్వలేదని అంటున్నారు. మరి గతంలో అలా ఎలా చెప్పవు..ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే జవాబు ఇవ్వరు.ఇక పవన్ కళ్యాణ్ కూడా తాను లేస్తే మనిషిని కానట్లు..నాలుగేళ్లు ప్రశ్నించలేదు.ఇప్పుడు తాను మోసపోయానని అంటున్నారు.ఈ ముగ్గురిలో బిజెపి,టిడిపిలదే అదిక బాద్యత అని చెప్పక తప్పదు.అంటే ఎపి ని వీరు ముగ్గురు కలిస విఫలం చేశారు. కాని చంద్రబాబు లో ఉన్న గొప్పతనం ఏమిటంటే రాష్ట్రంలో ఏమైనా జరిగి ఉంటే అదంతా తన ఒక్కడివల్లే జరిగిందని,జరగనిదంతా బిజెపి ఖాతాలోకి వేసేసి చేతులు దులపుకోవాలని, లేదంటే విపక్షం అడ్డుపడిందని చెప్పాలన్నదే. జనం పిచ్చి వాళ్లని ,తాను ఏమి చెప్పినా చెల్లుతుందని ఆయన నమ్మకం. చాలా చేశానని చెబుతున్న చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మానిపెస్టో ని దగ్గర పెట్టుకుని ఒక్కక్కటి వివరిస్తూ ఇవి చేశాం.ఇవి చేయలేదు.అని చెప్పే దైర్యం ఉందా?రుణమాఫీ ఎంత చేస్తామన్నారు? ఎంత చేశారు. రాజదాని 2018 నాటికి మొదటి దశ అయిపోతుందని అన్నారా?లేదా? పోలవరం ప్రాజెక్టు నుంచి w జూన్ నాటికి నీళ్లు ఇస్తామని చెప్పారా?లేదా?నిరుద్యోగ బృతి రెండువేల రూపాయలు చొప్పున ఎప్పటి నుంచి ఇస్తామన్నారు? ఎందుకు ఇవ్వలేదు?అన్న క్యాంటిన్లు ఇంతకాలం ఎందుకు పెట్టలేదు?పట్టిసీమ లో 400 కోట్ల అవినీతికి ఏమి సమాదానం చెబుతారు?రాజదాని పేరుతో అమరావతిలో అన్నీ కేంద్రీకృతం చేస్తున్నట్లు కనిపిస్తున్నా,ఇంతవరకు ఒక్క ఇటుక ఎందుకు పడలేదు?రాష్ట్రంలో కులాల మద్య చిచ్చు పెట్టిన విమర్శలకు ఎందుకు ఆస్కారం ఇచ్చారు.కాపులు, ఎస్.టి.లు,బిసిలు ఇలా ఆయా వర్గాలను మోసం చేశారన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి?అన్నిటికి మించి ఒక ముఖ్యమంత్రి అంటే ఎంతో కొంత ఆదర్శంగా ఉండాలి.అలాంటిది ఏమీ లేకుండా చంద్రబాబు చెప్పారా?అది నిజం అయి ఉండదులే..ఆయన అబద్దాలు చెబుతారులే అన్న అప్రతిష్టను ఈ నాలుగేళ్లలో ఎందుకు మూట కట్టుకున్నారు. ఓటు కు నోటు కేసు లో అడ్డంగా దొరికి పోయి ఆంద్రులకు హైదరాబాద్ మీద ఉన్న హఖ్కును వదలుకున్న దౌర్బ్యాగ్యం ఎందుకు పట్టింది? ఇరవై మూడు మంది విపక్ష ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుగోలు చేసి ఆంద్రుల పరువును ఎందుకు తీశారు? దదేశంలోని అన్ని రాష్ట్రాలకు అవతరణ దినోత్సవాలు ఉండగా, ఆంద్రులకు మాత్రం అడ్రస్ లేకుండా చేసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు.పుష్కరాల సమయంలో ప్రచారం యావలో పడి 29 మంది తొక్కిసలాటలో మరణిస్తే దానికి ఎవరు బాద్యులు? ప్రత్యేక హోదా పై ఎన్నిసార్లు మాట మార్చారు? నాలుగేళ్లలో లక్షి ఇరవై వేల కోట్ల అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది. అయినా ప్రత్యేక విమానాలు సెవెన్ స్టార్ హోటళ్లలోనే ముఖ్యమంత్రి ఉంటూ పేద అరుపులు ఎందుకు అరుస్తున్నారు?ఇలా చెప్పుకుంటూ పోతే వైఫల్యాల చిట్టా చాంతాడు అంత అవుతుంది. చంద్రబాబు చేసింది గోరంత అయినా ప్రచారం మాత్రం కొండంతగా ఉంటుంది. స్థూలంగా ఇది చంద్రబాబు నాలుగేళ్ల పాలన.

tags : ap, tdp, rule

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info