A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్యనాయుడుది తిరిగే కాలు కదా..
Share |
October 19 2018, 4:03 am

తిరిగే కాలు ఆగదని సామెత. మంత్రి,బిజెపి నేతగా దేశ వ్యాప్తంగా విస్తారంగా పర్యటిస్తూ వచ్చిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇప్పుడు కూడా రికార్డు సృష్టించారు. గత ఉప రాస్ట్రపతి హమీద్ అన్సారీ తన ఐదేళ్ల టరమ్ లో మొత్తం 71 సార్లు ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తే ,వెంకయ్య నాయుడు పదవి చేపట్టిన పది నెలల్లోనే 76 సార్లు పర్యటనలు చేశారని ఒక కధనం వచ్చింది.అందులో అత్యదికం తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లకే కావడం విశేషం. ఆ తర్వాత కర్నాటక తదితర రాస్ట్రాలు ఉన్నాయి.36 శాతం పర్యటనలు తెలుగు రాష్ట్రాలలోనే సాగాయి. సాదారణంగా ఉప రాష్ట్రపతి హోదా లో వచ్చినప్పుడు ప్రోటోకాల్ చాలా ఉంటుంది. అదికారికంగా రిసీవ్ చేసుకోవడం, ట్రాఫిక్ ఆపడం తదితర చర్యలు చేపట్టవలసి ఉంటుంది.కాగా ప్రదాని మోడీ అత్యధిక టూర్లు ఉత్తరప్రదేశ్ కు వెళ్లగా, ఆ తర్వాత గుజరాత్ సందర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు తక్కువగా వచ్చారు. ఆ రాస్ట్రాల వారు ఆహ్వానిస్తేనే వస్తున్నారట.

tags : venkayya, tours

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info