A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఎంత ఎత్తు ఎదిగారు..
Share |
October 19 2018, 4:14 am

విపక్ష నేత జగన్ తనకు నచ్చాడని ప్రముఖ సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ అన్నారు. ఉండి నియోజకవర్గంలో ఆయన జగన్ ను కలిసి వచ్చిన తర్వాత మాట్లాడారు. ఆచరణ సాద్యం కాని హామీలు చేయనని జగన్ చెప్పారని, ఉదాహరణకు రుణమాఫీ గురించి అడిగితే,అది సాద్యం కాదని, తాను ఆ వాగ్దానం చేయబోనని అన్నారని, దాంతో తనకు జగన్ అంటే ఆకాశం అంత ఎదిగారని అనిపించిందని అన్నారు.అబద్దాలు, మోసాలు చేయనని జగన్ చెప్పడం తనకు సంతోషం కలిగించిందని, ఆయన ఎంత ఎదిగాడన్న అభిప్రాయం కలిగిందన్నారు. అదే చంద్రబాబు విషయంలో అలా చెప్పే పరిస్తితి లేదని అన్నారు. చంద్రబాబు ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా దెబ్బతీసి,వారిని నాశనం చేయాలని చూస్తారని,కేసులు పెట్టి,అవిగో కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తారని, చివరికి సొంత మామ ఎన్.టి.రామారావును మానసికంగా,భౌతికంగా దెబ్బతీశారని ఆయన అన్నారు. మాట మీద నిలబడే మనిషిగా ,వచ్చే ఎన్నికలలో జగన్ ను గెలిపించాలని ప్రజలను కోరుతున్నానని, ఆయన సరిగా పాలన చేయకపోతే తాను ఏ శిక్షకు అయినా సిద్దం అవుతానని పోసాని వ్యాఖ్యానించారు.

tags : posani, jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info