A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా
Share |
August 21 2018, 11:28 am

ఎపి ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇంతకాలం ప్రదాని మోడీ వద్ద రాస్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తమ పార్టీ అదినేత జగన్ ను కేసులలో ఇరికించి ఇబ్బంది పెట్టడం కోసం, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల కోసమే ప్రయత్నం చేసేవారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్.పి పదవికి రాజీనామా చేసిన మేకపాటి రామోహన్ రెడ్డి అన్నారు.తాము ఈ నెల ఇరవైతొమ్మిదిన స్పీకర్ సుమిత్ర మహాజన్ ను కలిసి తమ రాజీనామాలను ఆమోదించాలని కోరతామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి ఇరవై సీట్లు వస్తే కేంద్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే, అప్పుడు ఎపికి ప్రత్యేక హోదా ,ఇతర డిమాండ్లు నెరవేర్చేవారికే మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. చంద్రబాబు కు ఇప్పటికే పదిహేడు లోక్ సభ స్తానాలు ఉండగా, మరో ముగ్గురు వైసిపి ఎమ్.పిలను ఆయన లాక్కున్నారని ,అయినా ఏమీ సాదించలేకపోయారని, మళ్ళీ పాతిక మంది ఎమ్.పిలను ఇవ్వాలని ,ఏదో చేస్తానని అంటున్నారని,ప్రజలు దీనిని నమ్మడానికి లేదని మేకపాటి అన్నారు. చంద్రబాబు ఇప్పుడు బిజెపి గ్రాఫ్ తగ్గుతోందని బావించి బయటకు వచ్చారని ఒకవేళ బిజెపి వారు చంద్రబాబు కోరిన సీట్ల పెంపకం తదితర అంశాలలో ఒప్పుకు్న్నా, ఆ పార్టీతో పొత్తు వదలుకునేవారని అన్నారు. అందుకు ఉదాహరణ గతంలో వాజ్ పేయి తో కలిసి ఉండి,ఆయన ప్రబుత్వం ఓడిపోగానే జీవితంలో మళ్లీ బిజెపితో కలవనని అన్నారని మేకపాటి గుర్తు చేశారు.ఇప్పుడు ఉన్న పరిస్తితిలో చంద్రబాబుకు ఎపిలో ఒకటి,రెండు పార్లమెంటు సీట్లు వస్తే గొప్ప అని, ప్రజలు వైసిపి కి పట్టం కట్టబోతున్నారని ఇరవైకి పైగా లోక్ సభ సీట్లు వస్తాయని ఆయన అన్నారు.

tags : mekapati, babu,

Latest News
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info