A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముద్రగడ లేఖాస్త్రం
Share |
June 23 2018, 2:24 am

పూజారులకు వారసత్వం ఉండరాదని ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో మాత్రం తన కుమారుడు లోకేష్ కు వారసత్వం గా పదవి ఇచ్చారని మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు.ఈ విషయమై ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తవ్వకాలు, ఆస్తుల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, ఈమేరకు చంద్రబాబు ప్రధానిని కోరాలని ఆయన సూచించారు. తరచూ బాబు నిప్పు అని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే దర్యాప్తు ముందు నిలబడాలని అన్నారు. తనను ఎదిరించే వారిని అదే కులస్తులతో తిట్టించే దురలవాటు ముఖ్యమంత్రికి ఉందని విమర్శించారు. బాబును ఏదో జబ్బు వేధిస్తోందని, దాని కారణంగానే ఇలాంటి దురలవాటు ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో చంద్రబాబు రోగానికి మందు లేదని, అందుచేత జబ్బు బాగా ముదిరిపోయిందని ముద్రగడ అన్నారు.

tags : mudragada, letter

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info