A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నా వల్లే ఎపిలో టిడిపి గెలిచింది- చంద్రబాబు
Share |
May 22 2019, 4:01 am

2014 లో తనపై ఉన్న విశ్వాసం తోనే ఆంద్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.మహానాడులో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ విభజనను తెచ్చిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒకే వైఖరి తో ఉందని, రెండు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరామని అన్నారు. ఎపి ప్రజలు తనపై విశ్వాసం తో ఎన్నుకున్న తర్వాత విజన్ తో పనిచేశామని ఆయన అన్నారు.2022 నాటికి దేశంలోనే మూడు అగ్రరాష్ట్రాలలో ఒకటి చేస్తామని ఆయన అన్నారు.అన్ని సమస్యలతో వచ్చామని ఆయన అన్నారు. తొలి రోజున తన ప్రయాణం బస్ లో అని అన్నారు. ఎపిలో సమస్యలు లేకుండా చేశామని ఆయన అన్నారు. బారతదేశంలో నెంబర్ ఒన్ పనితీరు కలిగిన రాష్ట్రం ఎపి అని గర్వంగా చెబుతున్నానని అన్నారు. కొందరు నాయకులు మాట్లాడుతున్నారని, వారికి సవాల్ చేస్తున్నానని ,వారి రాష్ట్రాలలో ఏమి చేశారో,తాము ఏమి చేశామో తేల్చుకోవాలని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా తాము చేశామని చంద్రబాబు అన్నారు.

tags : chandrababu, tdp, victory

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info