A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి - బ్రాహ్మణ వివాదంలో చంద్రబాబు
Share |
May 22 2019, 4:37 am

ఎపిలో నిత్యం ఏదో ఒక వివాదం రాజకుంటోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేంద్ర బిందువు అవడం విశేషం.టిటిడి బోర్డు ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసినప్పుడు అందులో కొందరు క్రైస్తవ మత ప్రచారానికి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్య అనిత అయితే తాను క్రిస్టియన్ అని ,బైబిల్ లేకుండా బయటకు వెళ్లనని చెప్పిన వీడియో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ తర్వాత ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల వివాదం బ్రాహ్మణ సమాజాన్ని కుదిపివేసిందని చెప్పాలి.ఏకంగా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, బ్రాహ్మణులకు మద్య పోరాటంగా రూపాంతరం చెందిందన్న అబిప్రాయం ఏర్పడింది.దైవం , భక్తి అన్నవి విశ్వాసాలకు సంబందించినవి.ఆ విశ్వాసాలకు ఎక్కడ దెబ్బతగిలినా భక్తుల మనో భావాలు గాయపడతాయి. నిత్యం లక్షల మంది సందర్శించుకునే ఇలవేలుపుగా శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు.అయితే ఆయన చుట్టూ, ఆయనకు అందుతున్న సపర్యలనండి, కైంకర్యాలనండి అవి సజావుగా సాగడం లేదని స్వయంగా ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణ దీక్షితులు ఆరోపించడం సంచలనంగా ఉంది. అలాగే శ్రీవారి ఆభరణాలు గల్లంతయ్యాయన్న ఆరోపణ కూడా చిన్నది కాదు. రమణదీక్షితులు 1996 నుంచే ఆభరణాలు గల్లంతయ్యాయని చెప్పడం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి, ఇప్పుడు కూడా సి.ఎమ్.గా ఉన్న చంద్రబాబుకు ఇబ్బందే.కారణం ఏమైనా రమణ దీక్షితులు ఇన్నేళ్ల తర్వాత ఈ విషయం చెప్పడం కూడా విమర్శలకు దారి తీసింది.వారసత్వంగా ఉన్న ఆయన అర్చక పదవిని ప్రబుత్వం తొలగించిన తర్వాత ఈ విషయాలు బయటపెడుతున్నారన్న విమర్శ ఆయన ఎదుర్కుంటున్నారు.దానికి ఆయన ఏ కారణాలు చెప్పవచ్చు.అది వేరే విషయం. ఇక ప్రబుత్వ పరంగా ఇలాంటి సున్నితమైన విసయాలపై జాగ్రత్తగా స్పందించాలి. లేదంటే భక్తులకు అనుమానాలు రాకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలి.ఏ ఆరోపణలు వచ్చాయో,వాటిని విచారించడానికి సిద్దపడాలి. కాని ఎందుకో చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడుతోంది.రమణ దీక్షితులు ఏకంగా కేంద్ర హోం శాఖ వరకు వెళ్లి పిర్యాదు చేశారంటే చిన్న విషయంగా తీసుకోవడానికి లేదు. గతంలో ఒక కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. స్వామి వారి పైఉన్న ఒక ఆభరణంలోని వజ్రం భక్తులు విసిరే నాణాల వల్ల పగిలిపోయిందని పేర్కొన్న విషయాన్ని ఆయన చూపించి అదెలా సాధ్యమని అడుగుతున్నారు.అదే సమయంలో టిటిడి చైర్మన్ సుధాకర్ యాదవ్ కాని, ఇ.ఓ. సింఘాల్ కాని అసలు అది వజ్రమే కాదని, లేనిదానిని ఎక్కడ నుంచి తేవాలని అంటున్నారు. కాగా మరో పురావస్తు శాఖ అదికారి శ్రీవెంకటేశ్వరుడికి శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆబరణాలు చాలా గల్లంతు అయ్యాయని అంటున్నారు. ఇంత తీవ్రంగా ఆరోపణలు వచ్చినప్పుడు దీక్షితులు అడుగుతున్నట్లుగా సిబిఐ విచారణ కాకపోయినా, ఒక మాజీ న్యాయమూర్తి తో అయినా విచారణ జరిపించవచ్చు కదా.లేదా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసిన ముఖ్యమైనవారిని పిలిచి అన్ని ఆభరణాలను చూపించి సందేహ నివృత్తి చేయవచ్చు కదా..అవేవి చేయడం లేదు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గాఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని విచారణలకు డిమాండ్ చేస్తే వాటినన్నిటిని అంగీకరించారు.పరిటాల రవి హత్య జరిగిన్పుడు చంద్రబాబు ఏకంగా వైఎస్ కుమారుడిపై ఆరోపణ చేస్తే దానిని కూడా పరిగణనలోకి తీసుకుని సిబిఐ విచారణ కు ఆదేశించారు.అలాగే ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో చంద్రబాబు పలు ఆరోపణలు చేశారు.దానికి కూడా సిబిఐ విచారణ చేయించారు.కాని చంద్రబాబు ఇప్పుడు ఎందుకో వెనుకాడుతున్నారు. పైగా టిటిడి వివాదం కాస్త బ్రాహ్మణులకు, చంద్రబాబు కు మద్య ఘర్షణగా మారింది. మాజీ చీప్ సెక్రటరీ అయితే ఏకంగా ప్రస్తుతం రాష్ట్రంలో కరడుగట్టిన కులస్వామ్య పార్టీ పాలన సాగుతోందని, మిగిలిన కులాలకు వ్యతిరేకంగా ఆ కులం ఏలుబడి నడుస్తోందన్నట్లుగా ఆరోపణ చేశారు.ఇది కూడా సీరియస్ విషయమే.గత టమర్ లో చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు పెద్దగా రాకుండా జాగ్రత్తపడ్డారని చెప్పాలి.కాని ఈసారి కులతత్వం, అవినీతి, అదికార దుర్వినియోగం,విచ్చలవిడిగా నిదులు ఖర్చు చేయడం వంటి నగ్నంగా కనిపిస్తున్నాయి. బ్రాహ్మణ వేదిక పేరుతో ఆ వర్గం వారు సమావేశం అయి చంద్రబాబు బ్రాహ్మణులను అవమానిస్తున్నారని ఆరో్పించారు. ఇదంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం అని చెప్పాలి.చిలుకూరు బాలాజీ ఆలయ ప్రముఖ అర్చకుడు రంగరాజన్చంద్రబాబును ప్రశ్నిస్తూ లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చిన తీరు, తన మనుమడితో సహా కుటుంబం అంతటిని ఉగాది వేదికపైకి తీసుకు వచ్చిన వైనాన్ని ప్రశ్నించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.వీటికి చంద్రబాబు వద్దకాని, టిడిపి నేతల వద్ద కాని జవాబు లేదు. మరో మాట చెప్పాలి. తాను వెంకటేశ్వరుడి భక్తుడిని అని తిరుపతి వెళ్లినప్పుడు చంద్రబాబు చెబుతుంటారు. కాని అమరావతిలో మాత్రం ఆయన బుద్దిజాన్ని ప్రమోట్ చేస్తున్నారేమిటా అని కొందరికి అనుమానం .సాదారణంగా తమ వెనుక హిందూయిజం నమ్మే ముఖ్యమంత్రులు పెట్టుకోదలచుకుంటే వెంకటేశ్వరుడి విగ్రహాన్నో, లేక తాము నమ్మే దైవం విగ్రహం,లేదా పటాన్ని పెట్టుకుంటారు.కాని చంద్రబాబు నాయుడు మాత్రం బుద్దుడి బొమ్మ పెట్టుకుని క నిపిస్తుంటారు. పోని ఇదేదో సిద్దాంతం అని నమ్మి అనుకుంటే పొరపాటే. చంద్రబాబును అపరబుద్దుడు అనుకోవాలన్న తాపత్రయమో,ఏమో తెలియదు.నిజంగా బుద్దుడి విధానాలను నమ్మితే వాటిని ఆచరించాలి కదా. కాని నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ, ఎవరో ఒకరిమీద బురదచల్లుతూ ద్వేషాలు రగుల్చుతూ బుద్దుడి సిద్దాంతానికి విరుద్దంగా ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే,అసలు హిందూయిజానికి విఘాతం కలిగేలా బుద్దిజాన్ని ప్రమోట్ చేసేలా అమరావతి పేరు పెట్టడం కాని, బుద్దుడి పోటో తన వెనుక పెట్టుకోవడం కాని ఇవన్ని ఆసక్తికరంగానే కనిపిస్తాయి.అయినా అభ్యంతరం లేదు. కాకపోతే చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉండకూడదన్నదే ఇక్కడ పాయింట్. ఆ విషయం ఎలా ఉన్నా,రమణ దీక్షితులు వివాదంతో బ్రాహ్మణులలో మెజార్టీ వర్గం అయితే చంద్రబాబుకు దూరం అయినట్లే కనిపిస్తోంది. రమణ దీక్షితులు ఆమరణ దీక్షకు దిగినా, లేక రాస్ట్ర వ్యాప్తంగా ఆలయాల సందర్శనకు బయల్దేరి భక్తులను కలుసుకోవడం ఆరంబిస్తే చంద్రబాబు అది మరింత చికాకు అవుతుందని చెప్పక తప్పదు.(గ్రేట్ ఆంద్రలో ప్రచురితం)

tags : tirumala, chandrababu, ramanadeekshitulu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info