A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ ఇక లేరు
Share |
October 19 2018, 4:09 am

ప్రముఖ నటుడు, నిర్మాత మాదాల రంగారావు తుది శ్వాస విడిచారు. గతంలో ఆయన విప్లవ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవారు. ఆయన వయసు అరవైతొమ్మిదేళ్లు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యానికి గురై చకిత్స పొందుతూ మరణించారు.. ‘ఎర్రమల్లెలు’, ‘విప్లవశంఖం’, ‘స్వరాజ్యం’, ‘ఎర్ర సూర్యుడు’, ‘ఎర్రపావురాలు’, ‘జనం మనం’, ‘ప్రజాశక్తి’ తదితర చిత్రాల్లో నటించిన రంగారావు రెడ్‌స్టార్‌గా పేరుగాంచారు నవతరం ప్రొడక్షన్స్‌ పేరిట ఆయన పలు సినిమాలు తీశారు.ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించిన రంగారావు ప్రజా నాట్యమండలిలో క్రియాశీల సభ్యుడిగా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ, నిర్మాత పోకూరి బాబూరావు ఈయన సహాధ్యాయులు. నవతరం ప్రొడక్షన్స్‌ పతాకంపై మాదాల రంగారావు 1980లో తీసిన ‘యువతరం కదిలింది’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు పొందారు.

tags : madala, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info