A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దీక్షితులు -సోమిరెడ్డి వివరణ ఇచ్చారు కాని..
Share |
June 23 2018, 2:26 am

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులను బొక్కలో వేసి కొట్టాలన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దానిపై వివరణ ఇచ్చారు.రమణ దీక్షితులు చేస్తున్న ప్రయత్నాలనే తప్పు పట్టాను కాని, బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినట్లు వక్రీకరిస్తున్నారని ఆయన అంటున్నారు.బిజెపి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలతో దీక్షితులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. శ్రీవారి సేవలో ఇన్నాళ్లు పని చేసిన రమణ దీక్షితులు ఇప్పుడు శ్రీవారికే అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. శ్రీవారి భక్తుడిగా తన బాధను, ఆవేదనను వెలిబుచ్చానని చెప్పారు. రమణ దీక్షితులు వ్యవహారాన్ని బ్రాహ్మణ సమాజం సమర్ధిస్తుందా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు.తెలుగుదేశం మీడియా ఈ వివరణకు ప్రాముఖ్యత ఇచ్చింది కాని, ఇంతకీ రమణ దీక్షితులను బొక్కలో వేసి నాలుగు తగిలించాలన్న వ్యాఖ్యలకు సోమిరెడ్డి కట్టుబడి ఉన్నట్లా?కాదా అన్నది చెప్పలేదు. సోమిరెడ్డి అయితే ఆ పాయింట్ పై నేరుగా వివరణ ఇచ్చినట్లు లేదు.

tags : somireddy, clarification

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info