A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.పెమ్ ను ప్రజలు కలవక్కర్లేదా
Share |
August 21 2018, 3:01 pm

సీఎం ప్రజలను కలవాల్సిన పనేముంది?అని తెలుగు గేట్ వేలో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన విశ్లేషణ ఇది. మంత్రి కెటిఆర్ చేసిన వాదనపై ఈ కదనం.

‘వచ్చే దసరా నుంచి ప్రగతి భవన్ లో సీఎం కెసీఆర్ ప్రజలను కలుస్తారు’ ఇదీ గత ఏడాది జూలైలో సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం. మళ్లీ దసరా వస్తోంది. అలాంటి ప్రతిపాదన ఏదీ ఉన్నట్లు కన్పించదు. అంతే కాదు..తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి, సీఎం కెసీఆర్ తనయుడు కెటీఆర్ దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు రోజువారీగా ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన పనేముందని వ్యాఖ్యానించారు. సోమవారం నగరంలోని ఐఏఎస్ లకు అవార్డులు ప్రదానం చేసే కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గత ముఖ్యమంత్రులు చేసినట్లే..ఈ సీఎం కూడా ప్రజాదర్బార్ నిర్వహించాలని చాలా మంది అంటున్నారు. ఇది తెలివితక్కువ వ్యవహారం. ఓ ముఖ్యమంత్రి రోజువారి ప్రాతిపదికన ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది?. సీఎంకు ఎంతో పెద్ద పరిపాలనా వ్యవస్థ ఉంది. 31 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో కలెక్టర్లు ఉన్నారు. 564పైగా మండలాలు..మండల స్థాయి అధికారులు ఉన్నారు. గ్రామస్థాయి పరిపాలన కూడా ఉంది. 29 మంది గ్రామ స్థాయి నిర్వాహకులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుంది..వారి బాధ్యతలు నిర్వహించటానకి..ప్రజల అవసరాలు తీర్చటానికి.

ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుని…లక్షలాది మంది ఉద్యోగులను పెట్టుకుని, వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు, వేల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్న వ్యవస్థలో ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన అవసరం ఏముంది?. సీఎం చాలా పెద్ద విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతే కానీ ప్రజాదర్భార్ లు నిర్వహించటం కాదు. ప్రజాదర్భార్ లు నిర్వహించటానికి ఆయన మోనార్క్ కాదని..ఇది ప్రజాస్వామ్యం అని వ్యాఖ్యానించారు. ప్రజలు జిల్లాల నుంచి అన్నింటికి ముఖ్యమంత్రి దగ్గరకి వస్తే అది విఫల ప్రభుత్వంగా నిలుస్తుందనేది తన అభిప్రాయం అని కెటీఆర్ వ్యాఖ్యానించారు. పెన్షన్ల మంజూరు…గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో తీసుకోవాల్సిన అంశాలు ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే అది పెద్ద ఫెయిల్యూర్ గా భావించాల్సి ఉంటుంది అన్నారు. ప్రజల పనులు సహజంగా అలా అయిపోవాలి. అధికారిని తన పని కోసం అడిగి..అక్కడ కూడా కాకపోతే మంత్రి దగ్గరకు పోయి..తర్వాత ఎమ్మెల్యే దగ్గరకు పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా ఇది ఫన్నీ. మినిమం గవర్నమెంట్..మాగ్జిమమ్ గవర్నెన్స్ తమ విధానం అని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే సీఎం కెసీఆర్ ప్రజలనే కాదు…మంత్రులు..ఎమ్మెల్యేలను కూడా కలవటంలేదనే విమర్శలు నిత్యం విన్పిస్తున్నవే. అంతేకాదు.. దేశంలోనే సచివాలయానికి రాకుండా పరిపాలన సాగిస్తున్న సీఎంగా కెసీఆర్ ‘కొత్త చరిత్ర’ సృష్టిస్తున్నారు.


తెలంగాణలో రైతు భీమా పధకం అమలుపై జీవిత భీమా సంస్థకు, వ్యవసాయ శాఖ కు మద్య చర్చలు ఒక అంగీకారానికి రాలేదు.ప్రత్యేకంగా రైతుల వయోపరిమితిపై అవగాహన రాలేదు. తెలంగాణలో రైతులకు ఐదు లక్షల బీమా సదుపాయం కల్పించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 500 కోట్ల రూపాయలను కేటాయించింది. అవసరమైతే 800కోట్ల వరకు వ్యయం చేయడానికి కూడా సిద్దమైంది. ఎల్ ఐ సి ద్వారా దీనిని అమలు చేయాలని తలపెట్టారు. అయితే రైతుల వయోపరిమితి ఏభైఐదేళ్లకు పరిమితం చేయాలని ఎల్ ఐసి చెబుతోంది. కాని తెలంగాణలో అత్యధిక రైతులు ఏభై నుంచి డెబ్బై ఏళ్ల వరకు ఉంటారని ,అందువల్ల అంతవరకు అనుమతించాలని ప్రభుత్వ అదికారులు సూచిస్తున్నారు.దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరి కొంత సమయం కావాలని ఎల్ ఐ సి చెప్పింది.
..........................

tags : telganaa, cm

Latest News
*అదంతా చంద్రబాబు డబ్బే-బాండ్లపై ఆరోపణ
*టిడిపి ,టిఆర్ఎస్ పొత్తు-ఎమ్.పి సూచన
*ప్రత్యక్ష ఎన్నికల వరకే నోటా
*ముందస్తు ఎన్నికలు కెసిఆర్ ప్రచారమే
*అన్నా డి.ఎమ్.కెతో బిజెపి పొత్తు
*కుటుంబం కలిసి ఉండాలి-కరుణానిది కోర్కె
*చంద్రబాబు పాలన,బ్రిటిష్ పాలన ఒకటే
*ఇది లోకేష్ టెక్నాలజీనా
*సచివాలయ లీకేజీలపై జవాబు చెప్పండి
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*వరదల్లో సుప్రింకోర్టు జడ్జి కుటుంబం
*నాంపల్లి కేర్ వద్ద కిషన్ రెడ్డి దర్నా
*పోలవరం అంచనాలు తేల్చండి-గడ్కరి
*హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట
*బిజెపి ఎమ్మెల్యే అరెస్టు
*జగన్ మరో రెండు మర్చిపోయారేమో
*అయ్యన్నపాత్రుడిపై తీవ్ర ఆరోపణ
*లోకేష్ కట్టుబడి ఉంటే మంచిదే
*అమరావతి బాండ్లు -జగన్ వ్యాఖ్య
*కెసిఆర్ కు ధీటైన నేత ప్రతిపక్షంలో ఏరి
*కృష్ణపట్నం పోర్టుకోసమే అడ్డుపడుతున్నారు
*జగన్ సవాల్ స్వీకరిస్తారా
*దేశంలో వరదల వల్ల ఎందరు చనిపోతారంటే
*రాజధాని కోసం చంద్రబాబు అప్పులెందుకు
*శేట్టిబలిజలకు ప్రాదాన్యం ఇస్తాం-పవన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info