కర్నాటకలో బారతీయ జనతా పార్టీ అనైతిక విదానాలకు పాల్పడుతోందని టిడిపి తెలంగాణ శాఖ అద్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. కర్నాటకలో అసంబ్లీ ఎన్నికలలో బిజెపి పూర్తి మెజార్టీ సాధించలేదని ఆయన అన్నారు. ఎదుటి పార్టీలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ఆరోపించారు. బిజెపి కనుక ఇతర పార్టీలను చీల్చి అదికారం చేపడితే అప్రతిష్టపాలు కాక తప్పదని రమణ హెచ్చరించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కవద్దని ఆయన సూచించారు. tags : ramana, bjp