A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజ్ భవన్ లో ఏమి జరుగుతోంది-కాంగ్రెస్ ప్రశ్న
Share |
November 16 2018, 4:17 am

బిజెపి నేత ఎడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి కర్నాటక గవర్నర్ ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృఫ్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ,జెడిఎస్ లకు పూర్తి మెజార్టీ ఉంటే గవర్నర్ బిజెపిని ఎలా ఆహ్వానిస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు.గవర్నర్ నిర్ణయం సుప్రింకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు.రాజ్యాంగ బద్ధంగా కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించాలని కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. రాజ్‌భవన్‌లో ఏం జరుగుతోందో తమకు అర్థం కావట్లేదన్నారు. రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత గవర్నర్‌పైఉందని, కాని అది జరగడం లేదని సిబాల్ పేర్కొన్నారు.

tags : congress, karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info