A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మానసిక అంతర్మదనంతో రాజకీయాల్లోకి
Share |
July 20 2018, 10:15 pm

మానసిక అంతర్మదనంతో తాను రాజకీయ నేతగా మారానని తెలంగాణ జనసమితి అదినేత కోదండరామ్ చెప్పారు. సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన మనోగతం వివరించారు. కెసిఆర్ తో పడకే రాజకీయ పార్టీ పెట్టానన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఆ వివరాలు ..

రాజకీయనేతగా అవతారమెత్తారు. మీ అభిప్రాయం?

తీవ్ర ఉద్రిక్తతలు, ఉద్వేగాల మధ్య నడిచిన ఉద్యమంలో పనిచేసిన అనుభవం నుంచి రాజకీయ పార్టీ నేతగా మారడానికి తీవ్రమైన మానసిక అంతర్మథనం, సన్నిహితుల ఒత్తిడి కారణం. అయితే జేఏ సీలో ఇంతవరకు పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయాల్లోకి దిగడం ఇప్పుడేం కొత్తగా అనిపించడం లేదు.


కేసీఆర్‌తో పడకే రాజకీయాల్లోకి వచ్చారా?
వ్యక్తులపై అసమ్మతితో నిర్ణయాలు తీసుకుంటే మనం నిలబడలేం. ఒక్కమాటలో చెప్పాలంటే గత నాలుగేళ్ల మా అనుభవం నుంచి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి విధాన రూపకల్పనలో తగు సలహాలు ఇవ్వాలనుకున్నాం. ఉద్యమంలో అనేక విషయాలు తెలిశాయి కాబట్టి తెలంగాణ వస్తే ఏం మార్పులు సాధించాలి అని జనం ఆకాంక్షలను అర్థం చేసుకున్నాం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని తెలిసిన విషయాలను ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్నాం. కానీ ప్రభుత్వం అలాంటి సలహాలను మెల్లమెల్లగా పక్కనపెడుతూ వచ్చింది.

కేసీఆర్‌కూ, మీకూ మధ్య తగాదా ఎందుకొచ్చింది?
ఘర్షణలో వ్యక్తిగతమైనది ఏదీ లేదు. ఉద్యమకాలంలో ఏదయినా విభేదాలుంటే భిన్నాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. కానీ వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేశాం కాబట్టే తెలంగాణ సాధించగలిగాం.

గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్‌ టిక్కెట్లు కొంతమందికి ఇప్పించారా? మీపై ఇదీ ఒక ఆరోపణ మరి?
మేం ఏ పార్టీకీ, ఎవరికీ ఫోన్‌ చేయలేదు. జేఏసీ నుంచి కొంతమంది మిత్రులు రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. పలానా వ్యక్తి జేఏసీలో పనిచేసిండు అని ధ్రువీకరించాలి కదా. జేఏసీ అధినేతగా మీరు చెబితే మంచిది కదా అని కొందరు అడిగితే నిజమేనండీ ఆయన జేఏసీలో పనిచేశారు. ఈయన ఉద్యమంలో ఉపయోగపడ్డాడు అని చెప్పాం అంతే. కేవలం కాంగ్రెస్‌కే కాదు టీఆర్‌ఎస్‌కు కూడా ఇదే చెప్పాం.

మీపై కాంగ్రెస్‌వాది అని ఎందుకు ముద్ర వేశారు?
టీజేఏసీలోంచి ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలనుకున్నా వారందరికీ మేం సపోర్టు చేశాం. పలానావారు మా సంస్థకు చెందినవారే, క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేసినవారే అని ఆయా పార్టీల వారికి చెప్పాం. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ ఇలా ఏ పార్టీలోకి మావాళ్లు అడిగినా అందరికీ సపోర్టు చేశాం. వీళ్లు పలానా సమయంలో, పలానా స్థాయిలో ఉద్యమానికి తోడ్పాటునందిం చారు. మీకూ ఉపయోగపడతారు అని సిఫార్సు చేశాం. వారి బలాబలాలు ఇవీ. మీరు ఉపయోగించుకుంటే మంచిదే అన్నాం

tags : kodandaram, politics

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info