A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సోషల్ మీడియా -వైసిపి ప్రకటన
Share |
November 16 2018, 4:27 am

సోషల్ మీడియాలో కొంతమంది రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ,వాటితో తమకు సంబందం లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రకటించింది. ఆ పార్టీ ఒక ప్రకటన చేస్తూ తమ పార్టీ కార్యకర్తలుగా, సానుభూతిపరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులు పెడుతున్నారని ఆ పార్టీ తెలిపింది. వాటితో తమకు ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా పార్టీ పేరు ఉపయోగించుకుని సోషల్‌ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టు ఆ పార్టీ పేర్కొంది.ఇలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్‌రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఎ.సతీష్‌రెడ్డితో తమ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు.

tags : ysr congress, social media

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info