A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు అబద్దాలు క్లైమాక్స్ కు
Share |
September 19 2018, 2:04 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అన్నారు. ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.ఆయన ప్రసంగం ఇలా ఉంది.
చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఇవాళ క్లైమాక్స్‌కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేస్తాడు. ఒక పూటలో చంద్రబాబు బాబా అవతారం ఎత్తుతాడు. అందరూ వచ్చి బాబా బాబా అని ఆయన కాళ్లకు మొక్కుకుని పోవాలట. ఎన్టీ రామారావు డూప్‌ను తీసుకొచ్చాడు. పాపం ఆయన ఏ లోకంలో ఉన్నాడో గానీ చంద్రబాబు నాయుడు పొడిచిన వెన్నుపోటుకు తేరుకోలేకపోయాడు ఎన్టీ రామారావు. ఆయన్ను కూడా ఇవాళ బాబు డ్రామా కోసం వాడుకున్నాడు. ఆ డూప్‌.. చంద్రబాబును ఆశీర్వదిస్తున్నట్టు డ్రామాలు.. నిజంగా పద్మభూషణ్‌లు, పద్మశ్రీలు, ఆస్కార్‌ అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబునాయుడిని చూడలేదేమో. చూసి ఉంటే మాత్రం ఉత్తమ విలన్‌ అవార్డు చంద్రబాబుకే దక్కేది.ఈయనగారి మోసాలు ఎలా ఉన్నాయంటే విశాఖపట్నంలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ అంటాడు. రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటాడు. నిజంగా వచ్చాయా? ఇలాంటి నాయకుడు అవసరమా? అబద్ధాలు చెప్పే, మోసాలు చేసే నాయకుడు కావాలా? ఇలాంటి నాయకుడిని క్షమిస్తే రేపు ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు. ఇది నమ్మరని ఇంటింటికి మనిషిని పంపించి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతాడు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. అది మన డబ్బే. మన జేబులోంచి దోచేసిందే. ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యండి."అని జగన్ అన్నారు.

tags : jagan, babu,lies

Latest News
*పుష్కరాల తొక్కిసలాట- కోరినట్లే నివేదిక
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info