A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఆద్యాత్మికం
Share |
February 19 2019, 1:52 pm

రాజకీయ ఎజెండా ప్రకటించడానికి ముందు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఆద్యాత్మిక కార్యక్రమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన తొలుత కాలినడకన తిరుమల వెళ్లారు. తిరుమలపై రాజకీయాలు మాట్లాడకుండా, ఆ రోజంతా ద్యానం చేస్తున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.సోమవారం నాడు పవన్‌కల్యాణ్‌ సోమవారం తిరుమలలోని పుణ్యతీర్థాలను సందర్శించారు. జాబాలి తీర్థం లో హనుమంతుడిని దర్శించుకున్న పవన్‌కు హథీరాంజీ మఠం మహంతు అర్జున్‌దాస్‌ తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెనుక ఉన్న ధ్రువతీర్థాన్ని, పాపవినాశనంలో గంగాదేవిని దర్శించుకుని హంపిమఠం చేరుకున్నారు.చెగువేరా ను అభిమానించే పవన్ కళ్యాణ్ కు ఇంత భక్తి ఉందన్న విషయం ఇప్పుడే తెలుస్తోంది.

tags : pawankalyan, spirituality

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info