A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిని త్రిపుర చేస్తారట- అమిత్ షా కల!
Share |
May 25 2018, 8:41 am

ఆంద్రప్రదేశ్ గురించి బిజెపి అద్యక్షుడు అమిత్ షా కలలు కంటున్నారా?త్రిపురలో గెలిచిన మాదిరి ఎపిలో గెలుస్తామని ఆయన అన్నారట.కొత్త పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను డిల్లీలో కలిసిన సందర్బంగా జరిగిన సమావేశంలో ఇతర రాష్ట్రాల అద్యక్షులకు పరిచయం చేస్తూ ఈ మాట అన్నారట.కన్నా సీనియర్ మోస్ట్ నేత అని ఆయన చెప్పారు.ఆయన ఎంతో కష్టపడతారని అమిత్ షా అన్నారు. అందుకే ఈ బాధ్యతలు అప్పగించామన్నారు. ఏపీలో పార్టీ బలహీనంగా ఉందనే ప్రచారం జరుగుతోందని.. త్రిపురలో కూడా ఇదే ప్రచారం ఉండేదని, దానిని అధిగమించి ఎలా అధికారంలోకి వచ్చామో అలాగే ఏపీలో కూడా వస్తామనే విశ్వాసం ఉందని షా అన్నారని కదనం . అమిత్ షా కు త్రిపురకు,ఎపికి తేడా ఉందన్న విషయం తెలియదా?

tags : bjp, amit shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info