కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యే ఓడిపోయారని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ఎద్దేవ చేశారు. కర్నాకటలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని ఆయన అన్నారు.ప్రజలు మోడీ అభివృద్దిని అన్ని ప్రాంతాలలో ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. కర్ణాటకలో తాము పెద్ద పార్టీగా అవతరించామని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కేబినెట్లో సగం మంది ఓడిపోయారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా 35వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారని, మరోచోట 1700 ఓట్లతో కష్టపడి గట్టెక్కగలిగారని అన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టి గెలిచే ప్రయత్నం చేశారని , లింగాయత్‌లను చీలక చేసే ప్రయత్నం కూడా చేశారని అమిత్ షా ఆరోపించారు. tags : amit shaw, siddu