A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమిత్ షా పై రాళ్ల దాడి- జపాన్ నిరసనేనా
Share |
May 25 2018, 8:42 am

బిజెపి అద్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి చేసిన ఘటన ఒకవైపు టిడిపిలో గుబులు పుట్టిస్తోంది.మరో వైపు దానిని ఎలా వాడుకోవాలా అన్న ఆలోచన చేస్తున్నట్లుగా ఉంది.అమిత్ షా కుటుంబ సమేతంగా తిరుమలను దర్శించుకున్నారు.ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన.సాదారణంగా ఇలాంటి సందర్బాలలో రాజకీయంగా ఎవరూ పట్టించుకోరు. ఒక వేళ నిరసన చెప్పాలని అనుకున్నా నిర్దిష్ట స్థలంలో ఉండి తమ నిరసన తెలియచేయడం ఆనవాయితీగా ఉంటుంది.కాని ఇక్కడ తెలుగుదేశం అదినేతల ప్రోద్బలంతో అమిత్ షా రూట్ లోనే ఈ నిరసన చేపట్టడం విశేషంగానే ఉంది. కర్నాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిరసన చేశారని అంటారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే బిజెపి నేత బాను ప్రకాష్ రెడ్డి స్వయంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కు ఈ నిరసన గురించి ముందస్తు హెచ్చరిక చేసినా వారు చూసి,చూడనట్లు వదలివేశారంటే ,టిడిపి కార్యకర్తల రౌడీయిజానికి పూర్తి స్వేచ్చ ఇచ్చారంటే అది ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆదేశాలు లేనిదే చేస్తారా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అదే ఆరోపణను బిజెపి చేస్తుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఒక లక్షణం ఉంది.ఏదైనా ఘటన చేయించిన తర్వాత అది తనకు అనుకూలంగా ఉందనుకుంటే అదంతా తన ప్రతిభేనని ప్రచారం చేయించుకుంటారు. ఏదైనా తేడా వస్తే అబ్బే చంద్రబాబు కు తెలియదు..ఆయన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారని లీక్ ఇప్పించుకుంటారు.ఇలాంటి క్షుద్ర విద్యలలో చంద్రబాబును మించిన మొనగాడు మరొకరు లేరంటే ఆశ్చర్యం కాదు.నిజంగానే చంద్రబాబుకు తెలియకుండా ఇది జరిగితే వెంటనే సంబందిత ఎస్పిపై ఎందుకు చర్య తీసుకోలేదు?రాళ్ల దాడి చేసిన కార్యకర్తలపై ఎందుకు చర్యలు చేపట్టలేదు?అలిపిరి వద్ద నిరసనలు చేపట్టాలని టిడిపి కార్యకర్తలకు ఎస్.ఎమ్.ఎస్.లు ఇచ్చింది ఎవరు?ఈ ఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.తిరుమలేషుడి వద్దకు వెళ్లే వచ్చే విఐపిపై ఇలా రాళ్లదాడి చేయడం ఆంద్ర ప్రదేశ్ కు శభనిచ్చే అంశమేనా అన్న ప్రశ్న రావడంతో టిడిపి ఆత్మరక్షణలో పడింది. ఇదేదో రాళ్ల దాడిగానో లేక డిజిపి చెప్పినట్లు కర్రదాడగానో ముగిసింది అందువల్ల,షాకు పెద్దగా ఇబ్బంది కలగలేదు కాబట్టి సరిపోయింది..లేకుంటే మరో రకంగా అయి ఉంటే దేశ వ్యాప్తంగా ఎంత అలజడి వచ్చేది.ఎంత సేపు తాత్కాలిక ప్రయోజనం కోసం టిడిపి ప్రయత్నిస్తోందే తప్ప ఒక పద్దతిగా పోవడం లేదు. విలువల గురించి అసలు పట్టించుకోవడం లేదు. విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో కాండిల్ ర్యాలీకి వెళుతుంటే విమానాశ్రయం రన్ వేపైనే ఆపేసిన చరిత్ర చంద్రబాబుది.పైగా ఇలాంటి నిరసనలు అబివృద్దికి వ్యతిరేకమని ఆయన సూత్రీకరించారు.ఆయా విపక్షాలు ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆందోళనలకు దిగుతుంటే ఆ పార్టీల నాయకులను గృహనిర్భందంలో ఉంచిన చరిత్ర చంద్రబాబుది.అంతెందుకు.కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ ప్రత్యేక హోదా సమస్య పై డిల్లీనుంచి గుంటూరు వస్తే, ఆయనతో పాటు మరికొందరు ఇతర పార్టీల నేతలను కూడా ఆయన వెంటబెట్టుకు వస్తే టిడిపి కార్యకర్తలు ఆ సభ వద్దే నిరసన తెలిపారు. మరి ఇది చంద్రబాబు౯ మర్చిపోయారా?జగన్ ప్రత్యేక హోదాపై యువభేరీ లు పెడితే ,వాటికి పిల్లలు వెళితే వారిని జైలుకు పంపుతానని చెప్పిన పెద్ద మనిషి ,ఇప్పుడు యుటర్న్ తీసుకున్న తర్వాత యూనివర్శిటీలు, కాలేజీలు తేడా లేకుండా విద్యార్ధులను పోగు చేసి,అచ్చంగా తానే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న బిల్డప్ ఇచ్చుకోవాలని చంద్రబాబు ఎంత ప్రయత్నం చేస్తున్నారు.ఆయన నమ్మకం ఏమిటంటే తాను ఏమి చేసినా అదే కరెక్టు అని ప్రజలు అనుకుంటారని.జనం తాను చెప్పిన అసత్యాలను నమ్ముతారన్నది ప్రబలమైన అభిప్రాయం.ఆంద్రులు అబద్దాలకు,మోసాలకు ఇట్టేపడిపోతారని ఆయన విశ్వాసం. అందుకే ఆయన ఇంత ధైర్యంగా ఇన్ని రకాలుగా మాటలు మార్చుతున్నారు. ఇప్పుడు అమిత్ షా రాళ్ల దాడిపై కూడారెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది రివర్స్ అయింది కాబట్టి ,అధికారంలో ఉన్నవారు రాళ్లు వేయడమేమిటని అంతా నిందిస్తున్నారు కనుక చంద్రబాబు అబ్బే ఇలాంటివి చేయరాదని అంటున్నట్లు లీక్ ఇచ్చుకున్నారు.అదే ప్రజలలో దీనికి పాజిటివ్ వచ్చి ఉంటే ,చూశారా నేను కాబట్టి రాళ్లతో కొట్టించానని చెప్పుకునే యత్నం చేసి ఉండేవారు. చంద్రబాబుకు మరో భయం పట్టుకుంది. ఈ ఘటనను అమిత్ షా సీరియస్ గా తీసుకుని తనపై ఉన్న కేసులను మరింత వేగంగా ముందుకు తీసుకుని వస్తారేమోనన్న బెంగ కూడా పట్టుకుంది.దాంతో ఆయన రెండు,మూడు రకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే అనేక రూపాలుగా ఆంద్రుల పరువు తీసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఈ రాళ్లదాడిని అదికారికంగా చేయించి మరింత అప్రతిస్టపాలైందని చెప్పకతప్పదు.

tags : ap, japan,shaw

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info