A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప.గోదావరి గుండెల్లో బాబు గుణపాలు
Share |
November 16 2018, 4:55 am

గత ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పదిహేను సీట్లు తెలుగుదేశం కు కట్టబెడితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజల గుండెల్లో గుణపాలు గుచ్చారని జనం చెబుతున్నారని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు.రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే, ఇక్కడి ఎమ్మెల్యేలు తమ ఇష్టారీతిన దోచుకుంటు్న్నారని ఆయన అన్నారు. ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టుకుని టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చుకువెళ్లినప్పుడు అరాచకపాలనకు తొలి అడుగు పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మార్యోని దారుణంగా వమానిస్తే చింతమనేని ప్రబాకర్ ను నాలుగు బాది స్టేషన్ లో పెట్టవలసి ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయతీ చేసి ,అధికారిని అవమానించారని ఆయన అన్నారు. జిల్లాలో అంగన్ వాడీలను ఇక్కడ కొడుతున్నారని అన్నారు. జిల్లాలో అదనపు జడ్జిపై కూడా టిడిపి ఎమ్మెల్యే దౌర్జన్యం చేశరాని ఇది చంద్రబాబు తీర్చుకుంటున్న రుణం అని ఆయన అన్నారు.తమ్మినేని రిజర్వాయిర్ నుంచి చింతమేనని ఇసుక దోచుకుంటుంటే, మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి ఇసుక దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు.

tags : chandrababu, jagan,west godavari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info