A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిరంజీవికి ఏమైందో తెలుసుగా-జెసి వ్యాఖ్య
Share |
May 25 2018, 8:53 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను అనంతపురం టిడిపి ఎమ్.పి జెసి దివాకరరెడ్డి ఎద్దేవ చేశారు.గతంలో చిరంజీవి కులాన్ని అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం పార్టీ పెట్టారని, కాని ఆ పార్టీ గతి ఏమైందో అందరికి తెలుసని ఆయన అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా.. ఆయనకు సినిమాలంటే తెలుసు కానీ ప్రజా సమస్యలు ఏం తెలుసు’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ఉరవకొండలో సంఘీభావ దీక్షలో మాట్లాడుతూ.. పవన్‌కు కేవలం ప్రశ్నించడం మాత్రమే తెలుసని అన్నారు. సినిమాల్లో మాదిరి ఇక్కడ నటించడం అంత సులవు కాదని దివాకరరెడ్డి అన్నారు.

tags : jc, chiranjeevi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info