A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపితో పొత్తువల్ల సీట్లు తగ్గాయి- చంద్రబాబు
Share |
August 22 2018, 1:22 am

తనకే పేద ప్రజలే హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాను పుట్టిన రోజున దీక్ష చేయవలసి వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. దీక్ష విరమించిన తర్వాత ప్రసంగం చేశారు.ఎన్ని కష్టాలొచ్చినా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించను. రాష్ట్రాన్ని విభజించ వద్దని చిత్తశుద్ధితో పోరాడిన నాయకులు మళ్లీ ఈరోజు ఇచ్చారు అని ఆయన అన్నారు. అన్ని సంఘాలు, కుల వృత్తులవారు దీక్షకు మద్దతు తెలపడం బలాన్నిచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు రాలేదు. వారి అజెండా వేరే ఉంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఈ దీక్ష చేయలేదు.. మీరు ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల మంది తరఫున చేశా. మనకు ఆమోదయోగ్యంగా విభజన చేయలేదు. మనకు జరిగిన అన్యాయం చాలా బాధాకరం. ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేక పోతున్నారు. మాకే ఎందుకు జరిగిందని బాధపడుతున్నారు. అందరికీ సమానంగా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’’రాష్ట్ర విభజన సమయంలో ఇది కావాలని మనం అడగలేదు. న్యాయం చేయమని కోరాం. కేంద్రంలో ఉండే పెద్దలు ఆ బాధ్యత తీసుకోవాలి. కానీ, అలా చేయలేదు.బిజెపితో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు తగ్గుతాయని తెలుసు. కానీ, రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఎన్డీఏలో చేరాం అని చెప్పడం విశేషం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని ఆయన అన్నారు.

tags : chandrababu, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info