A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ పై అబిశంసన నోటీస్
Share |
October 19 2018, 4:42 am

భారత సుప్రింకోర్టు ప్రదాన న్యాయమూర్తి దీపక్ మిశ్ర ను అబిశంసించాలని కోరుతూ డెబ్బై ఒక్క మంది ఎమ్.పిలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ అజాద్ , సిపిఐ నేత డి.రాజా తదితరులు వెంకయ్య ను కలిసి అబిశంసన నోటీసు పత్రాన్ని ఇచ్చారు.దానిపై డెబ్బై మంది ఎమ్.పిలు సంతకాలు చేశారని సమాచారం.అయితే ఈ విషయమై కాంగ్రెస్ లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు. నోటీసులో తాను సంతకం చేయలేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మం‍త్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ చేసిన ప్రకటన ఇవే సంకేతాలను పంపుతోంది. లోయా కేసులో తీర్పును పురస్కరించుకుని విపక్షాలు ఈ నోటీసు ఇచ్చాయి. తీర్పును కొందరు సమ్మతించడం లేదనే కారణంతో అభిశంసన చేపట్టడం తీవ్రమైన చర్యగా సల్మాన్‌ ఖుర్షీద్‌ అన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం ఈ నోటీసుపై సంతకం చేయలేదు. కాంగ్రెస్‌ పార్టీ సహా ఏడు విపక్ష పార్టీలు ఈ నోటీసుపై సంతకాలు చేశాయని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ చెప్పారు.

tags : supreme court, impeachment, mps

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info