A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీపై బాలకృష్ణ తిట్ల పురాణం
Share |
January 17 2019, 4:20 pm

ఎపి ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందుపూర్ టిడిపి ఎమ్ఎల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీ పై దుర్భాష ప్రయోగించారని వార్తలు వస్తున్నాయి. విజయవాడలో చంద్రబాబు చేస్తున్న దీక్ష సభలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని మోడీ తన భార్యను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు. అక్కడితే ఆగకుండా ఆయన తెలుగువాళ్లతో పెట్టుకుంటే ఇంతే సంగతులు అని హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాదనలో భాగంగా జరిగిన నిరసనలో బాలకృష్ణ ప్రసార అర్హం కాని, ప్రస్తావించడానికి వీలు లేని భాషలో ప్రధాని మోడీని ఉద్దేశించి బూతులు మాట్లాడారని కొన్ని టీవీ చానళ్లలో స్క్రోలింగ్ వస్తోంది.బాలకృష్ణ బూతపురాణంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు.బాలకృష్ణ చేసిన ప్రసంగం ఇలా సాగిందని ఒక మీడియా కదనాన్ని ఇచ్ఇచ్చింది.

నువ్వొక ద్రోహివి.. తరిమికొడతాం..: ‘‘సామదానబేధదండోపాయాలు అంటారుకదా.. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. మోసం చేసిన మోదీని తరిమితరిమి కొట్టాలి. ఒక్క ఏపీలోనేకాదు దేశమంతటా ఆయనపై వ్యతిరేకత ఉంది. మోదీ.. నీకు తెలుగువాళ్ల ఘోష వినిపించట్లేదా? అయితే ముందు తెలుగు నేర్చుకో. దానితోపాటు పెద్దల్ని గౌరవించడం నేర్చుకో. అన్నింటికన్నా ముఖ్యంగా నీ భార్యను ప్రేమించడం తెలుసుకో. నీకు బాకా ఊదేవాళ్ల మాటలు వినకు. ఏపీకి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి. నిన్ను కొట్టి కొట్టి తరుముతాం, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం. ఒకప్పుడు నీ బజేపీకి రెండు సీట్లు కూడా లేవు. వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానెయ్‌. ఎవరెవరినో అడ్డం అడ్డంపెట్టుకుని వ్యవహారాలు సాగిస్తున్నశిఖండివి నువ్వు. (ఆ వెంటనే మోదీ తల్లిని ఉద్దేశించి దారుణమైన పదాన్నివాడారు)

మట్టీ, నీళ్లు మాకు లేవా?: అశాస్త్రీయంగా జరిగిన విభజనతో దిక్కులేకుండా పోయిన ఏపీని చంద్రబాబు ఒక్కరే ఉద్ధరిస్తాని జనం టీడీపీని గెలిపించారని బాలకృష్ణ అన్నారు. రాజధాని శంకుస్థాపనకు మోదీ మట్టి, పవిత్ర జలాలను తేవడాన్ని గుర్తుచేస్తూ.. ‘‘ఏం మా దగ్గరలేవా మట్టి, నీళ్లూ?’’ అని ప్రశ్నించారు. ఏపీ పౌరుడు ఒక్కొక్కరు ఒక గౌతమీపుత్ర శాతకర్ణిలా మారి బీజేపీపై, మోదీపై పోరాటం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. సదరు వ్యాఖ్యలను ‘స్ఫూర్తిదాయక ప్రసంగం’ వ్యాఖ్యత అభివర్ణించడం కొసమెరుపు. కాగా, ఎమ్మెల్యే బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ స్పందించాల్సిఉంది.

tags : tdp, balakrishna, modi

Latest News
*కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
*చంద్రబాబుకు తలసాని ఘాటు జవాబు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*తలసానిని కలిసిన టిడిపి నేతలు ఎవరో
*మోడీకోసమే పెడరల్ ప్రంట్-టిడిపి ఆరోపణ
*ఒడిషా లో కాంగ్రెస్ కు షాక్
*న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
*జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
*యుపిలో మా గ్రాప్ ఇంకా పెరుగుతుంది
*కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
*మరో సారి మోడీ-బిజెపి నినాదం
*ఎపిలో అసలు ప్రభుత్వం ఉందా
*దర్శి నుంచి వైసిపి అభ్యర్ది ఈయనేనా
*పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
*టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
*ఒమర్ అబ్దుల్లా ఇల్లు-ఆకర్షతుడైన కెటిఆర్
*తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం
*మే ప్రభుత్వం గండం నుంచి బయటపడింది
*అమిత్ షా కు స్వైన్ ప్లూ
*స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
*భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
*24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
*ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
*కూటమి నుంచి ఎదుకు బయటకు వచ్చానంటే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info