A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాయలసీమకు హైకోర్టు-ఐవైఆర్
Share |
April 21 2018, 1:52 am

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు అసలు ఎవరూ అడగకుండానే చేయాల్సిందని ప్రభుత్వ మాజీ ప్రదాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిని గుంటూరు ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సామాజిక సమతుల్యత, సామాజిక న్యాయం కోసం కనీసం పరోక్ష ఎన్నికల్లోనైనా మిగిలిన కులాల వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. హోదా కోసం పోరాడుతున్న అన్ని పార్టీలు దాని వలన కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై ఆలోచించడం లేదన్నారు. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే అవి పారిశ్రామికవేత్తలకు వెళ్తాయని... రాయితీలు ముగిసిన తరువాత వారు మరోచోటుకి వెళ్తారని విశ్లేషించారు. అదే రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు, లోటు బడ్జెట్‌కు సరిపడా మొత్తంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుంటే మంచిదని ఆయన అన్నారు.

tags : iyr, highcourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info