రూల్స్ చెప్పే రవాణా మంత్రి గారే కారుకే చలాన్ పడింది.తెలంగాణ రవాణ శాఖ మంత్రి పి.మహేందర్ రె్డ్డి వినియోగించే ఫార్చూనర్ వాహనం రాంగ్ సైడ్ వస్తుండగా ట్రాపిక్ పోలీసులు దానిని పోటో తీసి చలాన్ వేశారు.కొద్ది రోజుల క్రితం మెహిదీ పట్నం వద్ద ఈ వాహనం రాంగ్ సైడ్ వస్తుండగా పోలీసులు గమనించారు. అయితే ఆ సమయంలో మంత్రి ఆ కారులో లేరు. యధావిధిగా వాహనానికి చలాన్ పంపించారు. ఇంతవరకు ఆ చలాన్ చెల్లించలేదట.అంతేకాదు. అప్పుడు కారు నడుపుతున్న డ్రైవర్ ఎవరో కూడా ఇంతవరకు గుర్తించలేదట.కాగా ఈ వాహనం ఇంటిలెజెన్స్ విబాగం పేరుతో ఉంది.దీనిని రవాణా మంత్రి అవసరాలుకు వాడుతుంటారు. tags : vehilc,fine ,minister