A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగు రాష్ట్రాలలో ఎండలు తీవ్రం అవుతున్నాయి
Share |
July 20 2018, 2:04 pm

తెలుగు రాష్ట్రాలలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాదారణ ఉష్ణోగ్రతల కన్నా ఐదు నుంచి ఆరు డిగ్రీల అదిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వర్షాలు కురవడంతో చల్లబడ్డ వాతావరణం అంతా ఈ ఎండలతో మారిపోయింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరువయ్యాయి. మరో రెండు మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.. రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి గరిష్టంగా విజయవాడ, అమరావతి, గుంటూరు, రాజమహేంద్రవరం నగరాల్లో 41 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన చోట్ల ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల వరకు వేడి నమోదు అయింది.తెలంగాణలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.

tags : summer, temperatures

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info