A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రుణబకాయిదారులలో మంత్రి కుమారులు
Share |
July 20 2018, 2:12 pm

తెలంగాణ పంజాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లె కృష్ణారావు కుమారులు ఇద్దరు ఇప్పుడు బ్యాంకు రుణ ఎగవేతదారుల జాబితాలో చేరారు.వీరిపై ఒక ఆంగ్లపత్రికలో కధనం వచ్చింది.జూపల్లె కుమారులు అరుణ్ ,వరుణ్ లు 2013 లో శైలి ఇన్ ప్రా పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. తెలంగాణలో నీటిప్రాజెక్టులు, రోడ్డు ప్రాజెక్టులు వంటివాటికి కాంట్రాక్టులు చేసే లక్ష్యంతో ఈ కంపెనీని స్తాపించారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అరవై కోట్లరూపాయల రుణం తీసుకున్నారు.ఇందుకుగాను వారు కొన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు.అయితే ఆ తర్వాత వారు ఆ కంపెనీని వేరే కంపెనికీ అమ్మేశారు.ఆ సందర్భంగా వీరిద్దరూ రుణానికి గ్యారంటీ ఇచ్చారు. కాని ఇంతవరకు రుణం తీర్చకపోవడంతో రుణం మొత్తం ఎనభైఆరు కోట్లకు చేరింది. వీరు గ్యారంటి ఇచ్చిన ఆస్తులను ఈ వేలం ద్వారా అమ్మబోతే కేవలం రెండుకోట్ల ఇరవై లక్షల వరకే బిడ్ వచ్చింది. మంత్రి కుమారులు కావడంతో ఎవరూ వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని బ్యాంక్ అదికారులు అంటున్నారు.అంతేకాక ,అప్పట్లో రుణాన్ని లిబరల్ గా ఇచ్చారన్న అబివ్రాయం కూడా వచ్చింది.

tags : jupalle, loans,due,sons

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info