A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మక్కా మసీదు పేలుళ్లు-కేసు కొట్టివేత
Share |
July 20 2018, 2:18 pm

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ,ముఖ్యంగా హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలకు గురైన ఐదుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిందితులుగా ఉన్న దేవేందర్‌గుప్తా, లోకేశ్‌ శర్మ, స్వామి అసీమానంద, భరత్‌ భాయి, రాజేందర్‌చౌదరిపై అభియోగాలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పుపై ఎన్‌ఐఏ.. హైక్టోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.2007 మే పద్దెనిమిదిన చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదు ఆవరణలో బాంబు పేలి తొమ్మిది మంది మరణించగా, ఏభై ఎనిమిది మంది గాయపడ్డారు. పేలుడు అనంతరం జరిగిన అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో 9 మంది మృతిచెందారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరు ఇంకా దొరకలేదు.

tags : makka, blast

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info