తెలంగాణ రాష్ట్ర సమిత బాటలోనే మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ పార్టీ నడుస్తున్నట్లుగా ఉంది. కర్నాటకలో ఎమ్.ఐ.ఎమ్. కూడా జనతాదళ్ ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు ఆ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ట్వీటర్ లో తెలిపారు. కర్నాటకలో శాసనసభకు జరిగే ఎన్నికలలో మజ్లిస్ పార్టీ పోటీచేయబోదని ఆయన స్పష్టం చేశారు.జెడి ఎస్ కు మద్దతు ఇచ్చి, ఆ పార్టీ తరపున ప్రచారం కోసం బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. tags : asad, trs ,jds