A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి ఆనంద నగరం-నిజమా-కోతలా
Share |
February 24 2019, 9:22 am

ఏడాది లో అమరావతి ఆనందనగరం గా తయారవుతుంది.ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన వినడానికి ఎంత బాగుంది.చంద్రబాబుకు ఒక సిద్దాంతం పాటిస్తుంటారు. ఒక భవనం కట్టి దానికి నగరం అని పేరు పెడితే మొత్తం నగరాన్ని తానే కట్టిసినట్లు చెప్పుకోవచ్చు. ప్రచారం చేసే మీడియా ఎటూ ఉంటుంది. అలాగే ఇంతవరకు ఒక్క రాయి పడకపోయినా ఏడాదిలో ఆనంద నగరం అవుతుంది.చంద్రబాబు అదికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టిన సదస్సులు,మీటింగ్ లు అన్నిటిని కనుక లెక్క వేస్తే బహుశా అది ప్రపంచ రికార్డు కావచ్చు.ఆ సదస్పుల ద్వారా సాదించేది ఎంత ఉందనేది పక్కన బెడితే , ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతుంది. ఇదంతా తన వ్యక్తిగత ప్రచారం కోసం చేసే కార్యక్రమాలే తప్ప మరొకటి కాదు.కేవలం రెండు రోజుల సదస్సుకు వందల్లో మాత్రమే హాజరైన సదస్సుకు కోట్ల రూపాయలు వెచ్చించారు. నిజమే అసలు ఏ సదస్సు పెట్టవద్దని అనడం లేదు. కాని దానికి తగ్గ ప్రయోజనం కూడా ఎంతో కొంత ఉంటే మంచిది. ఒక వైపు ఏడాదిలో ఆనంద నగరం అయిపోతుందని చెబుతూ మరో వైపు ఆనంద నగరం గా మారడానికి సలహాలు ఇవ్వాలని నిపుణులను కోరుతున్నానని చెప్పడంలోనే డొల్లతనం కనిపిస్తుంది.గతంలో సైబరాబాద్ తానే నిర్మించానని చంద్రబాబు చెబుతుంటారు. అందులో ఎంత వాస్తవం ఉందన్నది జాగ్రత్త గా పరిశీలిస్తే తెలుస్తుంది. హైదరాబాద్ లోని మాదాపూర్ వద్ద ఒక భవనం నిర్మించిన మాట నిజం దానికి హైటెక్ సిటీ అని పేరు పెట్టిన మాట నిజం .అలాగే అక్కడ నుంచి కొంత బాగానికి సైబరాబాద్ అని పేరు పెట్టిన మాట వాస్తవమే. భవనం కడితే, వాటికి నగరం అని పేర్లు పెడితే మొత్తం నగరాలు నిర్మించానని అంటే జనం చెవుల్లో పూలు పెడుతున్నారని ఇట్టే అర్దం చేసుకోవచ్చు.పైగా సైబరాబాద్ ,హైటెక్ సిటీ ప్రాంతంలో ఇప్పటికీ రోడ్లు, డ్రైనులు తదితర సదుపాయాలు లేని ప్రాంతాలు ఉన్నాయంటే ఏమని చెప్పాలి.సైబరాబాద్ పేరు పెట్టిన కొద్ది కాలానికే ఆయన అదికారం కోల్పోయారు.మరి తర్వాత పద్నాలుగు ఏళ్లలో ఎంతో మార్పు వచ్చింది. వైఎస్ హయాంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది. పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ హై వే వచ్చింది.వాటన్నిటి గురించి కాంగ్రెస్ వారు కాని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను స్తాపించిన ఆయన కుమారుడు జగన్ కాని పెద్దగా ప్రచారం చేసుకోరు. కాని ప్రచారంలో దిట్ట అయిన చంద్రబాబు తనకు సంబందం ఉన్నా, లేకపోయినా, ఏదైనా తనకు ఉపయోగం అనుకుంటే తన ఖాతాలో వేసుకోవడం లో సిద్ద హస్తుడని అనుకోవాలి.అలాగే ఇప్పుడు అమరావతి అని పేరు పెట్టి మొత్తం నగరాన్ని తానే నిర్మించానని ప్రచారం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రణాళికలు వేయాలి.వాటికి అనుగుణంగా ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తారు. ఇది అన్ని చోట్ల జరిగేదే. కాని చంద్రబాబు అలాకాకుండా మొత్తం తాను నగర నిర్మాణం చేసినట్లు దాంతో ప్రజలంతా ఆనందంలో మునిగి తేలుతున్నట్లు ప్రజలు భ్రమించాలని కోరుకుంటారు.తద్వారా తనకు రాజకీయ లబ్ది పొందాలని అభిలసిస్తారు. ముప్పైమూడు వేల ఎకరాలను సమీకరించిన ప్రభుత్వం రైతులకు ప్లాట్లు ఇవ్వవలసి ఉంది.వాటిలో నిర్మానాలు రావాలి. అదే సమయంలో సన్న,చిన్నకారు రైతులు ఇప్పుడు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొందరు భూములు ఇవ్వకపోతే వారి పంటపొలాలలను ప్రభుత్వమే తగులపెట్టించి వారికి ఆనందం లేకుండా చేసిందన్న అబియోగం ఉంది.ఇక భూముల సేకరణ పేరుతో కొన్ని గ్రామాల వారిని నిత్యం పోలీసులతో,అదికారులతో వేధింపులకు గురి చేస్తూ వారికి ఆనందాన్ని దూరంచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని ఆనంద నగరం చేస్తానంటోంది.2050నాటికి విజయవాడ-గుంటూరు మద్య ఏబై లక్షల జనాభాను పోగు చేసే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజలకు ఆనందం ఎలా ఇవ్వగలుగుతుందో తెలియదు. నిజానికి రాజధాని అని ప్రకటించకపోయినా, అక్కడి ప్రజలు ఏమంత విషాదంలో లేరు. ఆనందం అంటే కాలుష్యం లేని నగరం అని అంటున్నారు.రాజదాని రాకముందు మూడు పంటలతో పచ్చగానే ఉండేది. కాలుష్యం కూడా లేదు.ప్రభుత్వ అవసరాలకు సరిపడా భూమి కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చినందుకు మాజీ సిఎస్ ఐలు ఐవైఆర్ కృష్నారావుతో పాటు అజయ్ కల్లం వంటి వారు కూడా తీవ్రంగా తప్పు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా అన్ని కార్యాలయాలు తొమ్మిది నగరాల పేరుతో పెట్టాలని ప్రతిపాదించారు.దీంతో మిగిలిన రాష్ట్రం అంతా మండి పడుతోంది. మొత్తం అబివృద్ది అంతా ఒకే చోట, ఒక సామాజికవర్గానికి ఉపయోగపడేలా చేస్తారని విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు చెబుతున్నట్లు అమరావతి లోని ప్రాంతంలో అబివృద్ది ఉంటే ఆనంద నగరంగా మారితే ,మిగిలిన నగరాలన్ని , అక్కడి ప్రజలంతా ఆనందం లేకుండా బతకాలా?కేవలం ధనికులైనంత మాత్రాన సంతోషం ఉండదని, పేదలు కూడా సంతోషంగానే ఉంటారని మరో ధీరి చబుతున్నారు. దానికి కారణం ఏమిటంటే సాయంత్రం పూట ముప్పై నిమిసాల సేపు భజన చేస్తే ఆనందం వస్తుందని చంద్రబాబు తేల్చేశారు. ఇవన్ని వింటుంటే ఏమనిపిస్తుంది. చంద్రబాబు పేదల గురించి కాకుండా కేవలం ధనిక వర్గాల గురించే ఆలోస్తున్నారని,వారి ఆనందం కోసమే ,పెద్ద,పెద్ద భవంతుల నిర్మాణం ద్వారా వారికే మేలు జరిగేలా ప్రవర్తస్తున్నారని అర్దం కావడం లేదు.తాజ్ మహల్ కట్టడానికి రాళ్లెత్తిన కూలిలెవ్వరు అని మహాకవి శ్రీ శ్రీ అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో పేదలకు స్థానం లేకుండా చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది. తాను కృష్ణా నది తీరాన ఒక భారీ అక్రమ కట్టడంలో ఆనందంగా ఉంటున్నాను కనుక అక్కడ జనం అంతా ఆనందంగా ఉంటున్నారని అనుకోవచ్చు. జనానికి ఆనందంగా ఎలా బతకాలో తెలియదని పాలకులు అనుకోవడమే పెద్ద విషాదం. ఎవరి మానాన వారిని బతకనిస్తే అదే వీరు చేసే గొప్ప మేలు.

tags : amaravati, happy city

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info