A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయసాయి కొత్త ఆరోపణ
Share |
April 21 2018, 1:54 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి మరో కొత్త ఆరోపణ చేశారు.ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి,కారు చౌకగా అమ్మిస్తున్నారని, ఇందులో ముడుపుల పర్వం ఉందని ఆయన ఆరోపించారు. రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన అన్నారు.చంద్రబాబు విదేశాలలో డబ్బు దాచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని విజయసాయి అన్నారు..కొందరు టిడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కూడా ఆయన చెప్పారు.

tags : vijayasai, allegation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info