A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కార్యక్రమాలకు కోడెల వెళ్లడం ఏమిటి
Share |
April 21 2018, 1:58 am

రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండవలసిన స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు టిడిపి కార్యక్రమాలలో పాల్గొనడం ఏమిటని జనచైతన్య వేదిక అద్యక్షుడు లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు.సభాపతి గౌరవాన్ని కాపాడాలని ఆయన స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. . రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ రాజకీయ పార్టీ సమావేశాలలో పాల్గొనటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
గత 4 సంవత్సరాలలో 23 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అప్రజాస్వామికమని లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాక పార్టీ ఫిరాయించిన వారిలో నలుగురు మంత్రుల పదవుల్లో కొనసాగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. గత ఎన్నికల్లో రూ. 11 కోట్లకు పైగా ఖర్చు చేశానని బహిరంగంగా స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ చెప్పిన విషయం విదితమే. కానీ, దానిపై ఇప్పటి వరకు ఏవ్యవస్థ చర్యలు తీసుకోకపోవటం దారుణమని లక్ష్మణ రెడ్డి అన్నారు.

tags : ap,kodela

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info