A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సునీతపై కత్తి మహేష్ 50 లక్షల దావా
Share |
April 21 2018, 2:00 am

గత కొద్ది రోజులుగా సినీ రంగంలో జరుగుతున్న వివాదాలు కొత్త మలుపు తిరుగుతున్నట్లుగా ఉంది. సినీ విమర్శకుడుగా పేరొందిన కత్తి మహేష్ పై సునీత అనే ఆమె లైంగిక వేదింపులు ఆరోపణ చేయడం సంచలనంగా మారింది.దానిపై మహేష్ ఒక వివరణ ఇస్తూ తనపై ఆరోపణల వెనుక పెద్దల హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘ఆ మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఒక ఛానెల్‌లో ఒకరకంగా.. మరో ఛానెల్‌లో మరో రకంగా... పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. అక్కడే ఆమెకు సరైన శిక్షణ ఇవ్వకుండా నాపై ఆరోపణలు చేయించారన్నది ప్రజలకు అర్థమైపోయి ఉంటుంది. అసలు వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నేనేంటో నాకు, నా సన్నిహితులకు తెలుసు. కానీ, పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నప్పుడు దాని నుంచి క్లీన్‌గా బయటపడాల్సిన అవసరం నాకు ఉంది..అని ఆయన అన్నారు.తనపై ఆరోపణల వెనుక కొణిదెల ప్రొడక్షన్ హస్తం ఉందా? లేదా? అన్నది తేలాలని,ఇకపై తనపై ఆరోపణలు చేసిన సునీతపై రూ.50 లక్షలకు దావా వేయనున్నట్లు మహేష్‌ ప్రకటించారు.

tags : mahesh, sunita,damage

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info