ఎపిలో పట్టిసీమ అవినీతిపై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి ఘాటుగా మాట్లాడారు.
పట్టిసీమ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, ఒక వేళ జరగలేదంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసే ఏ శిక్ష కైనా తాను సిద్ధమంటూ రాజు సవాల్ విసిరారు. ఏపీ ప్రభుత్వానికి దమ్ముంటే పట్టిసీమపై విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫొటోషూట్ కోసమే సీఎం పార్లమెంటు మెట్లకు మొక్కారని ఆయన అన్నారు. రోజూ ఇసుక కుంభకోణంలో కోట్లు కొల్ల గొడుతున్నారని, పట్టిసీమ, ఇసుక కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. tags : bjp, pattiseema