A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపికి పోటీగా బిజెపి బుక్ లెట్
Share |
November 16 2018, 9:34 pm

ఎపిలో తెలుగుదేశం వ్యతిరేక ప్రచారానికి పోటీగా బిజెపి కూడా పుస్తకాలు ముద్రించింది. గత నాలుగేళ్లలో కేంద్రం నుంచి అందిన సాయం గురించి ప్రజలకు తెలియజెప్పాలన్న ఆలోచనతో ‘ రాష్ట్రానికి కేంద్ర సహకారం’ అనే పేరుతో ఓ బుక్‌లెట్‌ను ఆ పార్టీ విడుదల చేసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విజయవాడలో ఈ బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే బుక్‌లెట్‌ విడుదల చేశామని ఆయన చెప్పారు.కేంద్ర ప్రభుత్వంపై ఎపి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొడుతూ ఈ బుక్ లెట్ తయారు చేశామని ఆయన వివరించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో బుక్‌లెట్‌ రూపంలో ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అసెంబ్లీలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలకు దీనిలో సమాధానం ఇచ్చాం. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసమే ప్రత్యేక హోదా ఇస్తామన్నాం. హోదా సాధ్యం కాదని ప్రత్యేక నిధుల మంజూరుకు కేంద్రం అంగీకరించింది. హోదాతో ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వరకు లబ్ధి చేకూరేది. ప్యాకేజీ రూపంలో అంతకంటే ఎక్కువ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. ప్యాకేజీ ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభినందించింది. కానీ ఇప్పుడు ప్రధాని రాష్ట్రానికి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

tags : haribabu, book let

Latest News
*హాయ్ లాండ్ అగ్రిగోల్డ్ ది కాదా
*కాంగ్రెస్ లో కమ్మవారికి అన్యాయం
*సిబిఐ ఎపికి రావద్దన్న జిఓ-ఉండవల్లి రియాక్షన్
*చంద్రబాబు సిబిఐ జిఓ ఎందుకు ఇచ్చారంటే..
*రేవంత్ కుటుంబానికి 16 కోట్ల ఆస్తి
*జనగామ నుంచి కోదండరామ్ పోటీచేస్తారా
*రాహుల్ ఇంటి వద్దే ధర్నా చేసిన కాంగ్రెస్ నేత
*నాకు మంత్రి పదవే ఎక్కువ అంటున్న నేత
*ఎపిలోకి సిబిఐ అడుగు పెట్టవద్దు-ఉత్తర్వులు
*చింతమనేని మరో ఆగడం
*చల్లబడ్డ సామా రంగారెడ్డి-కాని..
*సి.ఎమ్. ప్రత్యేకాధికారి రాజీనామా
*కొత్తగా తెలంగాణ రెబెల్స్ ప్రంట్
*చంద్రబాబు అందుకే వణుకుతున్నారు
*సిబిఐ మా అనుమతి తీసుకోవల్సిందే-చినరాజప్ప
*ఒక్కోనియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి-పవన్
*దానం నాగేందర్ కు కీలక మద్దతు
*చంద్రబాబుతో పొత్తు ఎందుకో చెప్పండి
*ఇటలీ ఏజెంట్లు మత మార్పిడుల ప్రోత్సాహం
*రాజకీయ సన్యాసం సవాల్ కట్టుబడి ఉంటా
*టిఆర్ఎస్ కు రాజీనామా లేదన్న ఎమ్.పిలు
*కెసిఆర్ గవర్నర్ వద్దకు 40 సార్లు వెళ్లారు
*అమెరికా నుంచి టిఆర్ఎస్ ప్రచారం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info