A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది
Share |
September 19 2018, 10:40 am

దేశం లో ప్రజాస్వామ్యం పై దాడిజరుగుతోంది, ప్రజల హక్కుల పై దాడి జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి   ఆవేదన వ్యక్తం  చేసారు. అంబేద్కర్  లిఖిత పూర్వక రాజ్యాంగం ఇచ్చారు కాబట్టే   దేశం  ముక్కలు చెక్కలు కాకుండా వున్నదని అన్నారు..
లేదంటే కులాల మధ్య, మతాల మధ్య  ప్రాంతాల మధ్య ,  వర్గ
పోరాటం జరిగి ఎప్పుడో విడిపోయేదన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ,
హక్కులు కలిపించిన ఏకైక గ్రంధం మన రాజ్యాంగం అని తెలిపారు. భారత
దేశ ప్రజలందరు రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంధంగా చూస్తారని
అన్నారు .రాజ్యాంగం 1950 లో  అమలులోకి వచ్చింది, 68 ఏళ్ల
క్రితమే  ముందు చూపుతో రాష్ట్రాలను   విభజించాలంటే 
 రాష్ట్రాలకు ఆధిపత్యం ఉండకూడదు, పార్లమెంట్ కె  అధికారం
దక్కాలని ఆర్టికల్ 3  లో సూచన  చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని
తెలిపారు. దోపిడి, అంటరానితనం, అణిచివేతకు గురవుతున్నవారి కోసం 
సామాజిక  అసమానతలను ఎదుర్కోవడానికి నాడు దళిత గిరిజనులకు  సామాజిక
వెనకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ కలిపించారని, సామాజిక
సమానత్వం  రిజర్వేషన్ల ద్వారానే  సాధ్యం అని రాజ్యాంగంలో
రిజర్వేషన్లు పొందుపర్చడం జరిగిందన్నారు. గుజరాత్, రాజస్థాన్
ఇంకా ఇతర ప్రాంతాలలో  కులాలవారీగా రిజర్వేషన్ అడుగుతున్నారు.
ఆర్ధిక వెనకబాటు ఆధారంగా కాకుండా సామాజిక వెనకబాటుతనం ఆధారంగా
రిజర్వేషన్ కలిపించడం జరిగిందని తెలిపారు. 

tags : kadiyam, democracy

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info