A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలుగుదేశం పంపిస్తున్న సంకేతాలు ఇవేనా
Share |
February 24 2019, 8:55 am

రాజకీయాలు ఎలా మారుతాయో చూడండి. ఇంతకాలం కాంగ్రెస్ ను దుర్మార్గపు పార్టీ అని, దుష్ట శక్తి అని, ఆంద్రుల పొట్టకొట్టిందని, అందుకే కాంగ్రెస్ ఆంద్రప్రదేశ్ లో మట్టి కొట్టుకు పోయిందని తెలుగుదేవం నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకాలం పెద్ద ఎత్తున ప్రచారం చేసేవారు. బిజెపి,తాము కలిసి ఎపిని అభివృద్ది చేసేస్తున్నామని ప్రచారం చేసేవారు. మోడీ,బాబు జోడి అంటూ కూడా కొందరు బిజెపి నేతలు కూడా పబ్లిసిటి ఇచ్చేవారు. కాని ఇప్పుడు రాజకీయాలు మారాయి. కాలం మారింది.తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కు సన్నిహితం కావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి.తెలుగుదేశం సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఏకంగా కర్నాటకలో బిజెపిని ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఆయన బెంగుళూరు వెళ్లి మరీ మాట్లాడారు. ఇలా అన్నారంటే కచ్చితంగా పార్టీ అదినేత చంద్రబాబు నాయుడి ఆమోదం లేకుండా జరగదు కదా.ఇటీవలికాలంలో బిజెపితో సంబందాలు తెగిపోయిన నేపద్యంలో ఇది తప్పు కాదు.వారు బిజెపితో విడిపోయిన తర్వాత అలా ప్రచారం చేయడం అభ్యంతరకరం కాదు.ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కర్నాటకలో బిజెపిని ఓడించండి అని చెప్పడం ద్వారా అక్కడ అదికారంలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపించండని పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో కర్నాటకలో కాంగ్రెస్ ,బిజెపి ల మద్య ప్రదానంగా లేదంటే జెడిఎస్ కూడా గట్టి పోటీ ఇస్తే ఆ మూడు పార్టీలు పోటీపడవచ్చు.ఇప్పటికైతే పలానా పార్టీకి ఓటు వేయండని చెప్పకుండా బిజెపి ని ఓడించండని కె.ఇ.అన్నారు.భవిష్యత్తులో అన్ని కుదిరితే కాంగ్రెస్ కు ఓటు వేయండని నేరుగా ప్రచారం కూడా చేయవచ్చు.మరో వైపు తెలంగాణ లో కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి టిడిపితో పొత్తుకు సై అంటున్నారు. సోనియాగాందీని దెయ్యం, ఇటలీ మాఫియా, ఇటలీ పుట్టిన రోజున ఎపిని విభజించింది అని నానా మాటలు అన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ ను కాకా పట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు విస్తారంగా వస్తున్నాయి.ఇప్పటికే డిల్లీలో జరిగిన ఒక మానవ హారంలో కాంగ్రెస్ ప్రముఖులతో టిడిపి ఎమ్.పిలు పూసుకు,రాసుకు తిరగడం, చేతులు కలపడం వంటివిచూశాం. రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్.రమేష్ అయితే ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ పక్కనే నిలబడడానికి ఎంత తాపత్రయపడింది అర్దం అవుతూనే ఉంది.అదే సమయంలో చంద్రబాబు కూడా తన వ్యాఖ్యలలో తాము సోనియాగాందీ పక్కన మానవహారంలో నిలబడితే వైఎస్ ఆర్ కాంగ్సె్ ఎందుఉ నిలబడలేదని ప్రశ్నించేవరకు వెళ్లారు.గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపడడానికి చంద్రబాబు ఏ రకంగా తటస్థ విధానం అవలంబించింది చూశాం. ఇప్పుడు తనపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద కేంద్రం లేదా,ఏదో రూపంలో విచారణలు వస్తే,కేసులు ఎదురైతే జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్ అండగా ఉంటుందన్న బావనతో చంద్రబాబు ఇలాచ ఏస్తున్నారన్నది కొందరి అనుమానం.గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై కేసులు పెట్టడంలో కాని, ఆయనను జైలుకు పంపించడంలోకాని, సోనియాగాందీ, చంద్రబాబు పరస్పరం సహకరించుకన్న సందర్భం ఉంది.అంతేకాదు..కాంగ్రెస్ నేత చిదంబరం వంటి నేతలతో చంద్రబాబుకు సత్సంబందాలు ఉన్నాయని అంటారు. అయితే బిజెపితో కలిసి అదికారంలోకి వచ్చాక, సోనియాగాందీని నానా విధాలుగా చంద్రబాబు దూషించారు. అయినా ఇప్పుడు మళ్లీ సోనియాగాందీని చంద్రబాబు ప్రసన్నం చేసుకుని కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా ఉంది.కాగా ఎపి కాంగ్రెస్ లో ఎక్కువ మంది నేతలకు ఇది ఇష్టం ఉండదు. అయినా కాంగ్రెస్ అదిష్టానం టిడిపితో పొత్తు పెట్టుకుని ఎపి, తెలంగాణలలో పోటీచేయాలని అనుకుంటే వీరు ఏమీ చేయలేరు. అయితే ఈ పరిణామాలన్ని జరుగుతాయా?లేదా అన్నది తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. కాని ప్రస్తుతానికి అయితే చంద్రబాబు కాని, తెలుగుదేశం నేతలు కాని ఇలంటి సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది.

tags : tdp, congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info