A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి పదవి-క్రైస్తవ సభలకు వెళ్లవచ్చా!
Share |
September 19 2018, 10:43 am

తెలంగాణ టిడిపి నుంచి తిరుమల ,తిరుపతి దేవస్తానం ట్రస్ట బోర్డు సభ్యత్వానికి పోటీ పడుతున్నవారిపై ఒక కదనం వచ్చింది.సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు మళ్లీ అవకాశం రావచ్చని ,మరో సభ్యుడి పదవి కి ముగ్గురు నేతలు పోటీపడుతున్నారని చెబుతున్నారు.వారిలో సీనియర్ నేత పెద్దరెడ్డి, ఇతర నేతలు నర్సిరెడ్డి, అరవింత్ కుమార్ గౌడ్, ప్రభృతులు కూడా ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అరవింద్‌కు బీసీ కోటాలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వాలని కొందరు పట్టుపడుతున్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో ఓ నేతకు క్రైస్తవ మిషనరీలతో సంబంధాలున్నాయని, ఆయనకెలా సభ్యత్వం ఇస్తారని కొందరు టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.అయితే చైర్మన్‌గా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ పై ఇలాంటి ఆరోపణలున్నాయని, తనకు ఆ నిబంధన ఎందుకు అడ్డంకిగా మారుతుందని ఆ నేత తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు సమాచారం అని కదనం వివరించింది. కాగా పుట్టా సుదాకర్ యాదవ్ గతంలో క్రైస్తవ మత సమావేశాలకు ముఖ్య అతిధిగా హాజరైనట్లు గా చూపుతూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారిందిన అంటున్నారు.అందులో వాస్తవం ఉందో ,లేదో తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇస్తే మంచిది.కేవలం ఒక అతిధిగా మాత్రమే వెళ్లి సౌహార్ద్రత తెలిపితే ఫర్వాలేదు .కాని అలాకాకుండా ఒక మత విశ్వాసిగా వెళితే అది హిందూ సమాజానికి ఆగ్రహం తెప్పించే అంశం కావచ్చు.

tags : ttdp, christian

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info