A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటకలో హంగ్ వస్తే బిజెపికి బెటరేనా
Share |
July 20 2018, 2:02 pm

కర్నాటకలో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందన్న అంతా భావిస్తున్న తరుణంలో వచ్చిన ఈ సర్వే ఆ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించేదే. కర్నాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని ఇండియా టుడే-కార్వీ సర్వే అందనా వేసింది.కాంగ్రెస్‌ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్‌) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు.కర్నాటకలో కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ రాకపోయినా, బిజెపికి అది పెద్ద విషయమే అవుతుంది. అప్పుడు జెడిఎస్ తో బేరాలు ఆడుకుని కాంగ్రెస్ అదికారంలోకి రాకుండా చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ ,జెడి ఎస్ కలవాలన్న అబిప్రాయం ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పలేం.పైగా బిజెపి ఓటు శాతంపెరుగుతుందని ఈ సర్వే చెబుతోంది.ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై పెద్దగా వ్యతిరేకత లేకపోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం.

tags : karnataka, bjp, congress, hung

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info