A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాజధానిలో హెరిటేజ్ బూమి- సాక్షి సంచలన స్టోరీ
Share |
September 19 2018, 10:36 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని స్థలం ఎంపిక కు ముందుగానే ఆయనకు చెందిన హెరిటేజ్ పుడ్ సంస్థ అక్కడ భూమిని కొనుగోలు చేసిందని, ఆ తర్వాత ఆయన రాజదాని ప్రకటన చేశారని సాక్షిలో ఒక ఆసక్తికరమైన కదనం వచ్చింది.ఆ భూమి కూడా లాండ్ పూలింగ్ లో పోకుండా జాగ్రత్త తీసుకున్నారని, అలాగే ఆ భూమికి సమీపం గుండా రింగ్ రోడ్డు వెళ్లేలా ప్లాన్ చేశారని ఆ కధనం చెబుతోంది. అందులోని కొన్ని భాగాలు ఇలా ఉన్నాయి.


2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం.

గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్‌ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్‌ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్‌ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు.

పూలింగ్‌ నుంచి మినహాయింపు
రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్‌ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్‌ పూలింగ్‌ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్‌ ప్రక్రియలో చేర్చనే లేదు.
♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్‌ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు విక్రయించారు.
♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం.

ఇలా.. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించడం గమనార్హం.

tags : amarvati, heritage

Latest News
*కెసిఆర్ ఓట్లు అడగనన్నారే
*ఔటర్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్ - రియల్ ఎస్టేట్ బూమ్
*వివిఐపి ఓటర్లు ఉన్నాయా..అదికారుల జాగ్రత్త
*బిజెపి ఎమ్మెల్యేలు 30 మంది చూపు కాంగ్రెస్ వైపు
*రాహుల్ వస్తే నల్లజెండాలు చూపిన టిడిపి ఈసారి..
*ఎపి సెక్రటేరియట్ నిర్మాణం-దోపిడీ నిజమే-కాగ్
*చంద్రబాబుపై కోర్టు దిక్కార పిటిసన్ -బిజెపి
*మీ సిపెమ్.పై అరెస్టు వారంట్ - ఎపికి లేఖ
*పంచాయతీ ఎన్నికలపై ఎపికి హైకోర్టు నోటీస్
*అమృతను ఎమ్మెల్యే చేయాలన్న సిపిఎం
*తెలంగాణలో గడీల పాలన- కోదండరామ్
*కెటిఆర్ వారసుడు అవుతున్నట్లేనా
*సినీ ప్రముఖులను బిజెపి ర ంగంలోకి తెస్తోంది
*కళ్లలోకి చూడలేని మోడీ
*మహిళలను టిఆర్ఎస్ ఇంటికే పరిమితం
*మిర్యాలగూడలో జానా vs గుత్తా
*తెలంగాణ మంత్రి హత్యకు రెక్కి జరిగిందా
*రాహుల్ కు ఆ తేడానే తెలియదు- షా ఎద్దేవ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info