రాజదాని ప్రకటనకు ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ 14 ఎకరాలు ఎలా కొన్నారో చెప్పాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.తన బినామీల రియల్ ఎస్టేట్ కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. తాడికొండ మండలంలో 14 ఎకరాల భూమిని రాజధాని ప్రకటనకు ముందే ఎలా కొన్నారో చెప్పాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఇప్పటికే ఇద్దరు సీఎస్‌లు(మాజీ) చంద్రబాబు దోపిడీని బయటపెట్టారు. రాజధానిలో హెరిటేజ్ కంపెనీ భూములను ఎలా కొనుగోలు చేసింది? భూముల కొనుగోళ్లపై నిజాలను బయటపెట్టాలి’ అని బొత్స కోరారు. tags : botsa, heritage, demand