A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆడపిల్లల గురించి పవన్ గట్టిగానే మాట్లాడారు
Share |
April 21 2018, 2:00 am

ఆడపిల్లల గురించి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ గట్టిగానే మాట్లాడారు. ఆడపిల్లల జోలికి వెళితే బహిరంగంగా వారి తోలు తీయాలని ఆయన అన్నారు. జమ్ము-కశ్మీర్ లోని కతువాలో జరిగిన అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ తన హృదయాన్ని ద్రవింపజేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కథువా ఘటన మెదటిది కాదు. మన వ్యవస్థలో ఓ దుర్ఘటన జరిగితే కానీ చలనం రాదు. నిర్భయ చట్టం కూడా దిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే వచ్చింది. తమ కళ్ల ముందు జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా? ఆడ పిల్లల్ని వేధించే ఈవ్‌ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టే వాళ్లని బహిరంగంగా శిక్షించాలి. అప్పుడే అందరికీ భయం పుడుతుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ‘ఓ తమ్ముడిగా, అన్నగా ఆడపిల్లలు బయటికి వెళ్తే వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసునని ఆయన అన్నారు. తెలుసు. ఆడపిల్లలు బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకూ ఇంట్లో కన్నవాళ్లు భయపడుతూ ఉండే పరిస్థితులు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

tags : pawan ,girl child

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info